తమిళనాడు రాష్ట్రంలో పురాతన విగ్రహలను చోరీ చేస్తున్న ముఠాను తమిళనాడు పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో పురాతన విగ్రహలను చోరీ చేస్తున్న ముఠాను ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తంజావూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దేవాలయాల్లో విగ్రహలను ఈ ముటా చోరీ చేస్తుంది. వరుసగా ఆలయాల్లో పురాతన విగ్రహలు చోరీకి గురౌతున్నాయి. దీంతో ఆలయ నిర్వాహకులు శరవణన్ ను ఆశ్రయించారు. దీంతో శరవణన్ చోరీకి గురైన విగ్రహలను ఆచూకీ చెప్పారు. శరవణన్ చెప్పిన చోటే విగ్రహలు లభ్యమయ్యాయి. దీంతో శరవణన్ స్వామీజీకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. శరవణన్ ఈ ముఠాతో సంబంధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆలయాల్లో పురాతన విగ్రహలు చోరీ చేయించి ఆ విగ్రహల ఆచూకీని శరవణన్ చెప్పినట్టుగా పోలీసులు గుర్తించారు. శరవణన్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
