చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఎమ్మెల్యేలకు అందించాలని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఎస్పీ వేలుమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. దానికి ఉదయనిధి స్టాలిన్ నుంచి ఘాటైన సమాధానం వచ్చింది. ‘మీ క్లోజ్ ఫ్రెండ్ అమిత్ షా కొడుకు జై షాను అడగండి’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
చెన్నై: ఐపీఎల్ మ్యాచ్ వీక్షించడానికి ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వాలని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఎస్పీ వేలుమని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు టికెట్లు ఇవ్వాలని కోరాడు. దీనికి రాష్ట్ర యూత్ వెల్ఫేర్, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ షార్ప్‌గా సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్ మ్యాచ్‌కు టికెట్లు కావాలా? వెళ్లి మీ ఫ్రెండ్ అమిత్ షా కొడుకు జై షాను అడగండి అంటూ చురకలంటించాడు.
తొండముతూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే వేలుమని ఈ విజ్ఞప్తి చేశాడు. ఎమ్మెల్యేలు ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి టికెట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని అడిగాడు. అంతేకదు, ఏఐఏడీఎంకే పాలనలో ఎమ్మలె్యేలకు ఐపీఎల్ టికెట్లు ఇచ్చేదని అన్నాడు. దీంతో ప్రభుత్వం రియాక్ట్ అయింది.
ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు కావాలా? అయితే, బీసీసీఐ సెక్రెటరీ జై షాను అడిగి టికెట్లు తెచ్చుకోండని రాష్ట్ర మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. ‘వేలుమని ఏమంటున్నాడంటే.. ఏఐఏడీఎంకే ప్రభుత్వం టికెట్లు ఇచ్చిందని చెబుతున్నాడు. కానీ, గత నాలుగేళ్లుగా ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లనే నిర్వహించలేదు. మీకు టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలుసు’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నాడు.
Also Read: ఆస్తి కోసం అమానుషం.. ప్రపార్టీ పేపర్లపై మరణించిన మహిళ వేలిముద్రలు.. వీడియో వైరల్
‘ఐపీఎల్ కూడా బీసీసీఐ కిందికే వస్తుంది. బీసీసీఐ హెడ్‌గా మీ క్లోజ్ ఫ్రెండ్ అమిత్ షా కొడుకు జై షా ఉన్నాడు. మీరు ఆయనతో మాట్లాడటం మంచిది’ అని చెప్పాడు.
తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీలు మిత్రపక్షాలని తెలిసిందే.
