మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం చిత్రం కూడా అలాంటి అంచలనతోనే విడుదలయింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించలేదు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం చిత్రం కూడా అలాంటి అంచలనతోనే విడుదలయింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించలేదు. మహెష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ తో కొంతవరకు వసూళ్లు రాబట్టింది.
అయితే ఈ చిత్ర కథపై విమర్శలు వచ్చాయి. తాజాగా సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ కూడా గుంటూరు కారం చిత్రం మహేష్ బాబు స్థాయిలో లేదని తేల్చేశారు. గుంటూరు కారం టైటిల్, ఈ చిత్ర కథ, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే చాలా గందరగోళంగా ఉన్నాయని పరుచూరి అన్నారు.
టైటిల్ ఏమో గుంటూరు కారం.. మాస్ టైటిల్. కానీ ఈ చిత్ర కథ తల్లి కొడుకుల సెంటిమెంట్ తో ఉంది. అలాంటప్పుడు గుంటూరు కారం అని మాస్ గా ఎందుకు పెట్టారు. కథలో తల్లి సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఆ విధమైన సన్నివేశాలు చివరి వరకు లేవు. కథ మొత్తం సంతకం అనే చిన్న పాయింట్ చుట్టూనే తిరుగుతుంది.

ఆ సంతకం చుట్టూ సన్నివేశాలు రాసుకునట్లు అనిపిస్తోంది. అసలు ఈ కథ మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి సరిపడేది కాదు. ఎందుకు త్రివిక్రమ్ ఈ కథని ఎంచుకున్నారో తెలియడం లేదు అని పరుచూరి అన్నారు. సంతకం కోసం కథని చాలా సాగదీశారు.
ఈ చిత్రంలో మాటలు కూడా త్రివిక్రమ్ స్థాయిలో లేవని పరుచూరి విమర్శించారు. అలాగే నటీనటులు చాలా మంది ఉన్నారు. సంతకం పెట్టించడం కోసం అసలు ఏ సంబంధం లేని హీరోయిన్ రావడం ఏంటో అని పరుచూరి అన్నారు. ఓవరాల్ గా గుంటూరు కారం చిత్రం మహేష్, త్రివిక్రమ్ స్థాయి సినిమా కాదని పరుచూరి అన్నారు.
