Asianet News TeluguAsianet News Telugu

జల్లికట్టుకు తమిళనాడు సర్కార్ గ్రీన్ సిగ్నల్


తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు పోటీలకు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు సీఎం స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జల్లికట్టు పోటీలను తిలకించేందుకు పరిమిత సంఖ్యలోనే వీక్షకులను అనుమతించారు.

Tamilnadu Government permits To Jallikattu
Author
Chennai, First Published Jan 10, 2022, 2:52 PM IST

చెన్నై: Jallikattuకు తమిళనాడు ప్రభుత్వం సోమవారం నాడు అనుమతిని ఇచ్చింది.   జల్లికట్టు Tamilnadu లో ప్రజలు సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పర్వదినం జరుపుకొనే సమయాల్లో తమిళనాడు రాష్ట్ర ప ప్రజలు  జల్లికట్టు పోటీలను జరుపుకొంటారు. జల్లికట్టుకు అనుమతిస్తూ సీఎం Stalin నిర్ణయం తీసుకొన్నారు.

జల్లికట్టు పోటీలను తిలకించేందుకు తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు తమిళనాడు సర్కార్ అనుమతి ఇచ్చింది. జల్లికట్టు పోటీలకు తమిళనాడు సర్కార్ షరతులతో అనుమతులు ఇచ్చింది. ఈ పోటీల్లో పాల్గొనేవారంతా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

 ఈ పోటీలను తిలకించేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య 150కి మించకుండా ఉండాలని కూడా ఆదేశించింది. మరో వైపు ఈ పోటీలను తిలకించేందుకు వచ్చే వారంతా కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ నెల 13 నుండి 15 తేదీల్లో జల్లికట్టు పోటీలు  జరుగుతాయి. జల్లికట్టు పోటీలు నిర్వహించే సమయంలో ఎద్దులకు కూడా ఎలాంటి గాయాలు కాకుండా చూడాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు ఎక్కువగా జరుగుతాయి.

రాష్ట్రంలో జల్లికట్టు పోటీలక అనుమతి ఇవ్వవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని  వైద్యులు కోరారు. రెండు వారాల క్రితం 80 మంది వైద్యుల బృందం  ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను జల్లికట్టుకు అనుమతి ఇవ్వవద్దని కోరింది.

ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ను వైద్యులు  కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో జల్లికట్టుకు అనుమతిస్తే ఒమిక్రాన్ వేరియంట్ సూపర్ స్పెడర్ గా మారే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు.

తమిళనాడులో AIADMK ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జల్లికట్టు పోటీలకు అనుమతి ఇవ్వాలని అప్పటి విపక్ష నేతగా ఉన్న స్టాలిన్  జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో DMK  ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో జల్లికట్టుకు స్టాలిన్ సర్కార్ అనుమతిని ఇచ్చింది.

తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిసోతున్నందున  ఈ నెల 9 నుండి  వీకేండ్ Lock down ను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మరో వైపు  ఈ నెల 6 వ తేదీ నుండే  రాత్రిపూట కర్ఫ్యూను కూడా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ సమయంలో జల్లికట్టుకు అనుమతిని ఇవ్వడంపై కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

తమిళనాడులో కరోనా కేసుల వ్యాప్తి సాగుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ ప్రజలను కోరారు. శనివారం నాడు ఒక్క రోజే తమిళనాడులో 10 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ మాసంలో అత్యధికంగా 10,728 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ తర్వాత శనివారం నాడు అత్యధికంగా 10 వేల కరోనా కేసులు నమోదు కావడం ప్రస్తుతం రాష్ట్రంలో  కరోనా కేసుల వ్యాప్తిని సూచిస్తోంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగం చెన్నై నగరంలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో మూడంకెల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios