Asianet News TeluguAsianet News Telugu

కుటుంబానికి రూ.వెయ్యి, ఓ గిప్ట్ హ్యాంపర్...ప్రభుత్వ ప్రకటన

సంక్రాంతి పండగను పురస్కరించుకుని తమిళ నాడు ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిరుపేద ప్రజలు కూడా పండగను ఘనంగా జరుపుకునే చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల నగదుతో పాటు ఓ గిప్ట్ హ్యాంపర్ అందించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల తమిళనాడు ప్రజలు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
tamilnadu government announced pongal bumper offer
Author
Chennai, First Published Jan 2, 2019, 7:23 PM IST

సంక్రాంతి పండగను పురస్కరించుకుని తమిళ నాడు ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిరుపేద ప్రజలు కూడా పండగను ఘనంగా జరుపుకునే చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల నగదుతో పాటు ఓ గిప్ట్ హ్యాంపర్ అందించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల తమిళనాడు ప్రజలు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇవాళ తమిళ నాడులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభ ప్రారంభానికి ముందు ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ శాసన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తరపున మాట్లాడుతూ సంక్రాంతికి ప్రభుత్వం అందించనున్న సహాయం గురించి ప్రకటించారు. అయితే ఇందుకోసం తమిళ నాడు ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది. 

కేవలం రేషన్ కార్డు వున్న కుటుంబాలకే వెయ్యి రూపాయలు అందిచనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులకు లోనైన...అంటే గజ తుఫాను, ఉత్తర తమిళనాడులో కరువు  బారిన పడ్డ ప్రాంతాల్లోని ప్రజలకు పండగా సరుకులతో కూడిన గిప్ట్ హ్యాంపర్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరు తమ రేషన్ కార్డు ద్వారా వెయ్యి రూపాయలతో పాటు ఈ సరుకులను కూడా తీసుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios