చెన్నై : తమిళనాడులో ఏఐఏడీఎంకే నేత పార్టీ బహిష్కరణకు గురయ్యారు. తమిళనాడు డిప్యూటీ సీఎం, ఏఐఏడీఎంకే సీనియర్ నేత పన్నీర్ సెల్వం సోదరుడు ఓ. రాజాను పార్టీ నుంచి బహిష్కరించారు. రాజా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది.
 
ఈ సందర్భంగా సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. రాజాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. పార్టీకి అప్రతిష్ఠ తీసుకొచ్చే విధంగా రాజా వ్యవహరిస్తున్నారని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. 

ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని కార్యకర్తలు సైతం ఆయనకు దూరంగా ఉండాలని అతనితో సంబంధాలు పెట్టుకోరాదని హితవు పలికారు. డిప్యూటీ సీఎం సోదరుడు పార్టీ నుంచి బహిష్కరణకు గురవ్వడం తమిళరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.