Asianet News TeluguAsianet News Telugu

కరోనా రాకుండా మందు అని చెప్పి.. విషం ట్యాబ్లెట్స్ మింగించి..!

కరోనా శిబిరం నుంచి వచ్చినట్టు పేర్కొంటూ యువకుడు ఫీవర్‌ టెస్ట్‌ చేసి విటమిన్‌ మాత్రలు ఇచ్చి వెళ్లాడు.

Tamilnadu covid drug deaths turn out to be murder, 3 die of poisoning
Author
Hyderabad, First Published Jun 28, 2021, 10:09 AM IST

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తుండటంతో.. దాని నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరు ఎలాంటి మందులు ఇచ్చినా.. కరోనా నుంచి బయటపడితే చాలాని.. అందరూ గుడ్డిగా నమ్మేస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకొని.. ఓ కుటుంబాన్ని అంతమొందించాలని పథకం వేశారు.  విటమిన్స్ అని నమ్మించి.. విషం ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అది నిజమని నమ్మి.. వాటిని తీసుకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  తమిళనాడు రాష్ట్రం  ఈరోజ్ జిల్లా చిన్నిమలైకి చెందిన కరుప్పన్నన్, ఆయన భార్య మల్లిక, కుమార్తె దీప, పని మనిషి కరుప్పాయి శనివారం సాయంత్రం పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో వీరి పొలంలో కొంత భాగాన్ని లీజుకు తీసుకున్న కళ్యాణ సుందరం కూడా అక్కడే ఉన్నాడు. అటువైపు కరోనా శిబిరం నుంచి వచ్చినట్టు పేర్కొంటూ యువకుడు ఫీవర్‌ టెస్ట్‌ చేసి విటమిన్‌ మాత్రలు ఇచ్చి వెళ్లాడు.

అవి వేసుకున్న కాసేపటికే కరుప్పన్నన్‌ కుటుంబం స్పృహ తప్పింది. గమనించిన ఇరుగుపొరుగు వారిని ఆస్పత్రికి తరలించగా మల్లిక, కరుప్పాయి, దీప మృతి చెందారు. కరుప్పన్నన్‌ కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కల్యాణ సుందరం ఆ మాత్రలు వాడకపోవడంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. కరుప్పన్నన్‌ పొలం లీజుతో పాటు ఆయన నుంచి తీసుకున్న రూ.13 లక్షలు చెల్లించలేని స్థితిలో హత్యకు పథకం పన్నినట్టు అంగీకరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios