దివంగత కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌‌ను కిడ్నాప్ చేసిన కేసులో ఎర్రచందనం స్మగ్లర్‌ వీరప్పన్‌ను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసును 18 సంవత్సరాల నుంచి విచారిస్తున్న తమిళనాడులో ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయం కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. 

వీరప్పన్‌పై చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోవడం, నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాలు లేకపోవడంతో వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 2000 జూలై 30న భార్య పార్వతమ్మతో కలిసి ఈరోడ్ జిల్లా తొట్టకాజనూరు రిసార్టుకు వచ్చారు కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌‌ను ఆ రోజు రాత్రి వీరప్పన్‌ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు.

దీంతో వీరప్పన్ అతని అనుచరులపై కేసు నమోదైంది. 107 రోజులు రాజ్‌కుమార్‌ను తన వద్ద బందీగా వుంచుకున్న వీరప్పన్‌.... తమిళనాడు జర్నలిస్ట్ నక్కీరన్ గోపాల్ సహా పలువురు సాగించిన రాయబారాల ఫలితంగా విడుదల చేశాడు. అయితే, 2004 అక్టోబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్, అతని అనుచరులు గోవిందన్, చంద్రగౌడ తదితరులు హతమయ్యారు. 2006లో రాజ్‌కుమార్, గత ఏడాది ఆయన భార్య కన్నుమూశారు.