చెన్నై: ఇటీవలే మాతృమూర్తిని కోల్పోయి బాధలో వున్న తమిళనాడు సీఎం పళనిస్వామిని వైసిపి ఎమ్మెల్యే, ఏపీఐఐసి ఛైర్మన్ రోజా పరామర్శించారు. చెన్నై నగరంలోని గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పళనిస్వామి ఇంటికి వెళ్లిన రోజా ఆయన తల్లి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రిని ఓదార్పుగా పలకరించారు. 

తమిళనాాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తల్లి తవసాయమ్మ ఇటీవలే మృతిచెందారు. వయసు మీదపడి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. దీంతో ఎడపాడి కుటుంబంతో విషాదం నెలకొంది. 

కరోనా నిబంధనల కారణంగా సీఎం తల్లి మృతదేహాన్ని సందర్శించలేకపోయిన నాయకులంతా ఇప్పుడు పళనిస్వామిని పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా తన భర్త సెల్వమణి కలిసి సీఎంను కలిశారు.  పాటు ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, బీజేపీ నేత కుష్బూ, డీఎండీకే నేత సుధీప్‌, సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి పళనిస్వామిని కలిసి సానుభూతి తెలిపారు.