Tamilnadu Accident : ఎన్నోర్ థర్మల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Tamilnadu Accident : తమిళనాడులోని ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణపనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న స్టీల్ ఆర్చ్ కూలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులు మరణించారు… అనేకమంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం 'X'లో ఒక పోస్ట్ చేసింది. "తమిళనాడులో ఓ నిర్మాణం కూలిపోవడం వల్ల జరిగిన దుర్ఘటన బాధ కలిగించింది. ఈ కష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 ఇస్తాం" అని ప్రకటించారు.
Scroll to load tweet…
