Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంకలో తమిళుల నిరసన.. పోలీసులు వాటర్ కెనాన్‌లు ప్రయోగిస్తే షాంపూ తీసి తల స్నానం

శ్రీలంక అధ్యక్షుడు రానిల్ విక్రమ్ సింఘే పర్యటనను వ్యతిరేకిస్తూ జాఫ్నాలో తమిళులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుని ర్యాలీ తీశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. వాటిని కూడా నిరసనకారులు ఖాతరు చేయలేదు. కొందరు నిరసనకారులు వాటర్ కెనాన్‌ల నుంచి వస్తున్న నీటి కిందికి పోయి షాంపూలు తీసి తలకు పెట్టుకున్నారు.
 

tamilian protestor pulls out shampoos as force fires water cannons in srilankas jaffna dist
Author
First Published Jan 16, 2023, 6:30 PM IST

న్యూఢిల్లీ: ప్రజలు రోడ్డెక్కితే ఎవరికీ తలవంచరని, పోలీసులు ఆందోళనలు అణచడానికి ఎన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేసినా నిర్భీతిగా ఎదుర్కొంటారని ఈ ఫొటోలు చూస్తే అర్థం అవుతున్నది. తమిళనాడులో అధ్యక్షుడు రానిల్ విక్రమ్‌సింఘే ఆదివారం జాఫ్నా యూనివర్సిటీ సందర్శించాల్సి ఉన్నది. కానీ, జాఫ్నా జిల్లాలో తమిళులు ఆ పర్యటనను వ్యతిరేకించారు. అధ్యక్షుడి పర్యటనను వ్యతిరేకిస్తూ ర్యాలీ తీశారు.

ఈ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు శతవిధా ప్రయత్నించారు. నల్లూరు అరాసతి రోడ్డు, వైమాన్ రోడ్డుల కూడలి వద్ద బారికేడ్లు పెట్టారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ, నిరసనకారులు ఆ బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. దీంతో వారికి చెక్ పెట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్ ‌లు ప్రయోగించారు. నిరసనకారులు వాటికీ వెరవలేదు. కొందరు యువకులు వాటర్ కెనాన్‌ల కింద నిలబడి జేబుల్లో నుంచి షాంపూలు తీశారు. తలకు పెట్టుకున్నారు. వాటర్ కెనాన్‌ల కింద తలస్నానం చేయడం ప్రారంభించారు. దీంతో అక్కడున్న పోలీసు సిబ్బంది నివ్వెరపోవాల్సి వచ్చింది.

Also Read: రాజీవ్ గాంధీ హంతకుల్లో నలుగురిని శ్రీలంకకు పంపే ఏర్పాట్లు: తమిళనాడు అధికారులు

మరో చోట పోలీసులను అడ్డుకోవడానికి మహిళలూ సిద్ధం అయ్యారు. నీరు, పెండ కలిపిన కలాపీని పోలీసుల పై చల్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. డాక్టర్ తుసియాన్ నందకుమార్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఈ ఫొటోలు, వీడియోలు పోస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios