తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది రజనీకాంత్ పార్టీ. 234 సీట్లలో పోటీ చేస్తామని రజనీకాంత్ సలహాదారు తమిళరువి మణియన్ ప్రకటించారు.

సరికొత్త రాజకీయాలకు రజనీ శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు. పార్టీ కార్యాచరణపై అనేకమందితో సూపర్ స్టార్ సంప్రదింపులు జరుపుతున్నారని మణియన్ పేర్కొన్నారు.

తమ రాజకీయాలు ఆధ్యాత్మిక పంథాలో కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి విద్వేషాలకు చోటు లేదని స్పష్టం చేశారు.

తాము ఎవరినీ తిట్టబోమని, ఎవరినీ కొట్టబోమని, తమ రాజకీయాలు ఇలాగే ఉంటాయని వివరించారు. మరోవైపు ఈ నెల 31న రజనీకాంత్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే.