Chennai: పామును చిత్రహింసలకు గురిచేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని తమిళనాడులోని కైనూర్ కు చెందిన మోహన్, సూర్య, సంతోష్ లుగా గుర్తించారు. నిందితుడు పామును పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి దాని మరణానికి కారణమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు.  

Three Tamil Nadu men held for biting off snake's head: సోష‌ల్ మీడియాలో లైకులు, వ్యూస్ సాధించే క్ర‌మంలో కొందరు యువ‌కుడు చేస్తున్న వెర్రిప‌నులు వారిని క‌ట‌క‌ట‌ల వెన‌క్కు పంపుతున్న ఘ‌ట‌న‌లు ఇదివ‌ర‌కు న‌మోద‌య్యాయి. తాజాగా ఇదే త‌ర‌హాలో మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. సోష‌ల్ మీడియా పోస్టుల కోసం ముగ్గురు యువ‌కులు ఒక పామును ప‌ట్టుకుని చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తూ దాని ప్రాణాలు తీశారు. అత్యంత క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తూ దాని త‌ల‌ను కొరికారు.. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైర‌ల్ కావ‌డంతో అట‌వీ శాఖ అధికారుల వ‌ర‌కు విష‌యం వెల్ల‌డంతో వారిపై కేసు న‌మోదుచేసి, అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. పామును చిత్రహింసలకు గురిచేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని తమిళనాడులోని కైనూర్ కు చెందిన మోహన్, సూర్య, సంతోష్ లుగా గుర్తించారు. నిందితుడు పామును పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి దాని మరణానికి కారణమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు. సోష‌ల్ మీడియాలో పంచుకున్న వీడియో దృశ్యాల ప్ర‌కారం.. యువకులు పామును పట్టుకోగా, నిందితుల్లో ఒకరైన మోహన్ చేతిలో పాము ఉంది. మోహన్ చేతిని పాము కొరికింది. మోహన్ పాము నా చేతిని కొరికింది. దానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాను అంటూ పాము తలను కొరికాడు. మిగతా వారు పామును వదిలేయండి అన్నారు. కానీ మోహన్ పాము తలను కొరికి చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. తీవ్ర గాయంతో పాము నొప్పితో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ దానిని వ‌దిలిపెట్ట‌కుండా.. చిత్ర‌హింసలు పెడుతూ నవ్వుతున్నట్టు క‌నిపించింది.

ఈ ఘటనను త‌మ‌ మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే సంబంధిత శాఖ పోలీసులు నిందితుడిని జంతు క్రూరత్వం, అడవి జంతువును చంపారనే అభియోగాలపై అరెస్టు చేశారు. ఈ దారుణమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యావరణ కార్యకర్తలు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి.. కైనూర్‌లో నివసించే మోహన్, సూర్య, సంతోష్ అనే ముగ్గురు యువ‌కుల‌ను సరీసృపాల‌ను చిత్రహింసలకు గురిచేసి చంపి, ఆ చర్యను వీడియో తీసి పంచుకున్నందుకు సంబంధిత నేరాల కింద కేసులు న‌మోదుచేశారు.