Cuddalore Road Accident: తమిళనాడులోని కడలూరు జిల్లా మేల్పట్టంపాక్కంలో రెండు ప్ర‌యివేటు బస్సులు ఢీకొన్న ఘటనలో 70 మందికి గాయాలయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు చికిత్స పొందుతూ న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Road Accident: త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. రెండు ప్ర‌యివేటు బ‌స్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. 70 మంది గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఈ దుర్ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. తమిళనాడులోని కడలూరు జిల్లాలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కడలూరు- పన్రుతి మధ్య రెండు ప్ర‌యివేటు బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఒక బస్సు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానికులు కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Scroll to load tweet…

ఈ ప్ర‌మాదంపై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Scroll to load tweet…