Tamil Nadu: తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  ట్రాన్స్ జెండర్ మహిళపై భ‌ర్త కుటుంబ స‌భ్యులు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. నిందితుల‌పై  ట్రాన్స్‌జెండర్ (హక్కుల పరిరక్షణ) చట్టం -2019 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో ట్రాన్స్‌జెండర్ చట్టం కింద తొలి కేసు నమోదు కావడం గమనార్హం. 

Tamil Nadu: తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో దారుణం జ‌రిగింది. ట్రాన్స్ జెండర్ మహిళపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ట్రాన్స్ జెండర్ తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్నందుకు అత‌ని కుటుంబ స‌భ్యులు దారుణంగా దాడి చేశారు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్ర‌ప్రదేశ్ నెల్లూరు జిల్లా పనకుడి సమీపంలోని సాతంకులానికి చెందిన ఉదయ ట్రాన్స్‌జెండర్ గా మారారు. ఆమె ప్రస్తుతం త‌మిళ‌నాడులోని పాలవూరులో నివసిస్తున్నాడు. ఈ క్ర‌మంలో కూడంకుళం సమీపంలోని శ్రీరంగనారాయణపురానికి చెందిన బాల ఆనంద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ ప‌రిచ‌యం కాస్త.. ప్రేమగా మారింది. వారిద్ద‌రూ ఆరు నెల‌ల పాటు స‌హజీవ‌నం చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ వారం రోజుల క్రితం వివాహమైనట్లు సమాచారం. 

బాల ఆనంద్, ఉద‌య‌ల వివాహం గురించి తెలుసుకున్న బాల ఆనంద్ కుటుంబీకులు వారిని వెతుక్కుంటూ మార్చి 23న పాలవూరు వచ్చాడు. వారిద్ద‌రి పెళ్లిని అంగీక‌రించినట్టు న‌మ్మించి.. బాల ఆనంద్ తండ్రి బాలమురుగన్, సోదరుడు సుభాష్, బంధువులు మణికందన్, శక్తివేల్, మరికొందరు వారిని కారులో తీసుకవెళ్లారు. ఈ క్ర‌మంలో ట్రాన్స్ జెండర్ ఉద‌య‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించి.. ఆమె పై విచ‌క్ష‌ణ ర‌హితంగా భర్త కుటుంబ సభ్యులు దాడి చేశారు. మార్గ‌మ‌ధ్య‌లో ప‌డేసి వెళ్లారు. బాలానంద్ మాత్రం తీసుకెళ్లారు. భ‌ర్త కుటుంబీకుల దాడిలో ట్రాన్స్‌జెండర్ ఉద‌య‌ ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ప‌రిస్థితి గ‌మ‌నించిన స్థానికులు కూడంకుళం ప్రభుత్వాసుపత్రికి త‌ర‌లించారు. ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం నాగర్‌కోయిల్‌ ఆసారిపాళ్యం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

ట్రాన్ జెండర్ ఉద‌య స‌మాచారం తెలియ‌క‌పోవ‌డంతో.. ట్రాన్స్ కమ్యూనిటీ .. కూడంకుళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదును నమోదు చేసింది. ఈ ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు ఉద‌య ఆచూకీ తెలుసుకోని.. ఆ క‌మ్యూనిటీకి స‌మాచార‌మిచ్చారు. జ‌రిగిన విష‌యం తెలుసుకున్న వారు.. బాలానంద్ కుటుంబ స‌భ్యుల‌పై పాలవూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాల ఆనంద్, బాలమురుగన్, లెట్సుమి, శక్తివేల్ మరియు మణికందన్‌లపై ట్రాన్స్‌జెండర్ (హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 కింద కేసు నమోదు చేశారు. తనపై దాడికి ప్రేమించిన భర్త కూడా కారణమని ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. తమిళనాడులో ట్రాన్స్‌జెండర్ చట్టం కింద తొలి కేసు నమోదు కావడం గమనార్హం.

ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇంకా ముగ్గురు ప్రధాన నిందితుల ఆచూకీ కోసం గాలిస్తుంది. ఈ క్రమంలో రాజీ కుదుర్చుకోవడానికి ఇప్పటికే ముగ్గురు లాయర్లు తమను సంప్రదించారని సౌబర్నిక ( ఉద‌య త‌ల్లి) చెప్పారు. కానీ తాము కేసు వెన‌క్కి తీసుకునేది లేద‌నీ తేల్చి చెప్పున్నారు. లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం కింద నమోదైన తొలి కేసు ఇదే కావడంతో కోర్టు ద్వారానే ప‌రిష్కారించుకుంటామ‌ని టాన్స్ క‌మ్యూనిటీ పేర్కొంటుంది.

ఈ కేసు విష‌యంలో తిరునల్వేలి పోలీసు సూపరింటెండెంట్ పి. శరవణన్ మీడియాతో మాట్లాడుతూ.. మిగిలిన నిందితుల కోసం వెతకడానికి కేరళకు ఒక బృందాన్ని పంపినట్లు చెప్పారు. అయితే నిందితులు చెన్నైలో ఉండే అవకాశం ఉందని ఆ తర్వాత గుర్తించారు. తాజాగా నిందితులు చెన్నైలో ఉన్నారని సమాచారం వ‌చ్చింద‌నీ, వారి కోసం ఒక బృందాన్ని పంపించమ‌ని తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో వారిని అరెస్టు చేస్తామ‌ని తెలిపారు. 

ఈ ఘ‌ట‌న‌పై తిరునెల్వేలి జిల్లా కలెక్టర్ వి.విష్ణు కూడా స్పందించారు.. ట్రాన్స్ పర్సన్ల సమస్యలపై అన్ని గ్రౌండ్ లెవల్ డిపార్ట్‌మెంట్లకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, మేము ట్రాన్స్‌జెండర్ సంఘం, NGOలతో ఏర్పాటు స‌మావేశం ఏర్పాటు చేశామ‌ని తెలిపారు, త్వరలో ప్ర‌తి మూడు నెలలకు ఒకసారి అవ‌గాహ‌న స‌ద‌స్సుల‌ను ఏర్పాటు చేశామ‌ని, వారి కోసం ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు ట్రాన్స్‌ వ్యక్తులకు కోచింగ్‌ తరగతులు కూడా ప్రారంభించామ‌ని తెలిపారు. ఈ కేసు విషయానికి వస్తే, మిగిలిన నిందితులను పోలీసులు చురుగ్గా ఆరా తీస్తున్నారు, త్వరలో వారిని పట్టుకుంటామని తెలిపారు.