Chennai: శుక్రవారం తెల్లవారుజామున, రిఫ్రిజిరేటర్ పేలిపోవడంతో వారి గదిని గ్యాస్, పొగ చుట్టుముట్టడంతో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు తోబుట్టువులు వారి ఇంట్లో ఊపిరాడక మరణించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదుచేసుకునీ, విచారణ జరుపుతున్నారు.
3 killed after refrigerator bursts: ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. బాధితుల్లో ఒకరి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అప్రమత్తం కావడంతో ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి ముగ్గురు మృతి చెందిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం తెల్లవారుజామున, రిఫ్రిజిరేటర్ పగిలిపోవడంతో వారి గదిని గ్యాస్, పొగ చుట్టుముట్టడంతో, ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు తోబుట్టువులు చెన్నై శివార్లలోని వండలూరు సమీపంలోని వారి ఇంట్లో ఊపిరాడక మరణించారు. కుటుంబంలోని నలుగురు సభ్యులు గురువారం అర్థరాత్రి దుబాయ్ నుండి చెన్నైకి వచ్చారు. బాధితులను వి.గిరిజ (63), ఆమె సోదరి ఎస్.రాధ (55), వారి సోదరుడు ఎస్.రాజ్ కుమార్ (45)గా గుర్తించారని దిహిందూ కథనం పేర్కొంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో రాజ్ కుమార్ భార్య భార్గవి, వారి కుమార్తె ఆరాధన (7)లు ఉన్నారు. ప్రమాదం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
గిరిజ భర్త వెంకటరమణ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చెంగల్‌పట్టు జిల్లా వండలూరులోని కిలంబాక్కం కోతండరామన్ నగర్‌లోని జయలక్ష్మి స్ట్రీట్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో దంపతులు నివసించేవారు. వెంకటరామన్ మరణించిన తరువాత, గిరిజ తన కొడుకుతో కలిసి దుబాయ్‌కి వెళ్లింది. ఇల్లు ఖాళీగా ఉంది. చాలా కాలంగా తాళం వేసి ఉంది. గురువారం రాత్రి గిరిజ తన సోదరుడి కుటుంబంతో కలిసి చెన్నై వచ్చి అపార్ట్‌మెంట్‌లో బస చేసింది. కుటుంబసభ్యులు శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు షార్ట్ సర్క్యూట్ వల్లనో, ఫ్రిజ్‌లోని వైర్లు సరిగా పనిచేయడం వల్లనో ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పేలిపోయిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదం కారణంగా బాధితులు నిద్రిస్తున్న ఇంట్లో రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ గ్యాస్ నిండిపోయింది. రాజ్ కుమార్ భార్య భార్గవి, అతని కుమార్తె ఆరాధన ఒక గదిలో నిద్రిస్తుండగా, గిరిజ, రాధ, రాజ్ కుమార్ వేరొక గదిలో నిద్రిస్తున్నారు. గ్యాస్, మంటల నుండి వచ్చిన పొగ కారణంగా వారు అప్రమత్తమయ్యే లోపే.. వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే భార్గవి సహాయం కోసం కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మరైమలై నగర్‌లోని అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. వారు గిరిజ, రాధ, రాజ్‌కుమార్‌ల మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గుడువంచెరి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ నాథ్, ఇతర అధికారులు ఇంటిని సందర్శించి పరిశీలించారు. నాథ్ మాట్లాడుతూ "ప్రాథమిక దర్యాప్తులో రిఫ్రిజిరేటర్ పగిలిందనీ, దాని నుండి వచ్చే వాయువు బాధితులు నిద్రిస్తున్న గదిని మొత్తం వ్యాపించాయని సూచిస్తున్నాయి. చాలా కాలంగా ఇంటికి తాళం వేసి ఉంచారు. కుటుంబసభ్యులు గురువారం రాత్రి మాత్రమే దాన్ని తెరిచారు. ఈ ప్రమాదంపై లోతుగా విచారణ జరుపుతున్నామని" తెలిపారు. ఫ్రిజ్ నుండి గ్యాస్, మంటల కారణంగా ఇంటిలోని వస్తువులు కాలిపోయాయని చెప్పారు.
