కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కూడా గత వారం రోజులుగా  ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. తాజాగా తమిళనాడులో(Tamil Nadu)  భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కూడా గత వారం రోజులుగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. తాజాగా తమిళనాడులో(Tamil Nadu) భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అక్కడ నిన్నటివరకు ఒక ఒమిక్రాన్ కేసు మాత్రమే నమోదు అవ్వగా.. తాజాగా ఒకేసారి 33 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో తమిళనాడులో మొత్తం Omicron Cases సంఖ్య 34కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ గురువారం తెలిపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూడటంతో తమిళనాడులో ఆందోళన నెలకంది. 

తాజాగా నమోదైన కేసుల్లో చెన్నైలో 26, మధురైలో 4, తిరువనామలైలో 2, సేలం నుంచి ఒకటి ఉన్నాయని మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు. ఒమిక్రాన్ నిర్దారణ అయినవారిలో విదేశాల నుంచి వచ్చినవారి, వారి కాంటాక్ట్స్ ఉన్నారని చెప్పార. బాధితులందరూ ఐసోలేషన్‌లో చికిత్స పొందున్నారని, వారిలో తీవ్రమైన లక్షణాలు లేవని చెప్పారు. వారందరి వ్యాక్సిన్ వేయించుకున్నవారేనని.. భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. మరో 23 మంది వ్యక్తుల జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు రావాల్సి ఉందన్నారు. 

Also read: శుభ‌వార్త‌.. Omicron ముప్పు త‌క్కువే.. తాజా అధ్యయనాలలో వెల్లడి!

తమిళనాడులో తొలుత నైజీరియా నుంచి దోహా మీదుగా డిసెంబర్ 10న తిరుచిరాపల్లికి (Tiruchirapalli) చేరుకున్న వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అది తమిళనాడులో రిపోర్ట్ అయిన తొలి ఒమిక్రాన్ కేసుగా నిలిచింది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని వైద్యాధికారులు తెలిపారు. 

ఇక, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. తాజాగాతెలంగాణ‌లో మ‌రో 14 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో న‌మోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చిన 14 మందికి క‌రోనా నిర్ధార‌ణ జ‌రిగిన‌ట్టు వైద్య ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. కేసులు పెరిగిపోతుండ‌టంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. 

ఇక, దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 300కు చేరువలో ఉంది. ఒమిక్రాన్‌ వేరియంట్ వేగంగా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని నరేంద్రం మోదీ నేడు స‌మీక్షా సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం ఈ సమావేశం జరగనుందని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. క‌రోనా ప‌రిస్థితి, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి, వైర‌స్ క‌ట్ట‌డి కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లు, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై చర్చించనున్నారు.