Asianet News TeluguAsianet News Telugu

15 కి.మీ. అడవి గుండా 30 ఏళ్లు: ఉత్తరాలు పంచిన పోస్టుమ్యాన్

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాలు, టెలిగ్రాం వంటి వాటి గురించి మనం మర్చిపోయాం. అయితే ఓ పోస్టుమాన్ ప్రతి రోజూ 15 కి.మీ అడవి గుండా నడుచుకొంటూ వెళ్లి మారుమూల గ్రామాలకు ఉత్తరాలను అందిస్తుంటాడు శివన్. 30 ఏళ్లుగా ఆయన క్రమం తప్పకుండా ఆయన ఈ విధులను నిర్వహిస్తున్నాడు.

Tamil Nadu postman walked 15 km through thick forests to deliver mails for 30 years, netizens salute him
Author
Chennai, First Published Jul 9, 2020, 4:16 PM IST

చెన్నై: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాలు, టెలిగ్రాం వంటి వాటి గురించి మనం మర్చిపోయాం. అయితే ఓ పోస్టుమాన్ ప్రతి రోజూ 15 కి.మీ అడవి గుండా నడుచుకొంటూ వెళ్లి మారుమూల గ్రామాలకు ఉత్తరాలను అందిస్తుంటాడు శివన్. 30 ఏళ్లుగా ఆయన క్రమం తప్పకుండా ఆయన ఈ విధులను నిర్వహిస్తున్నాడు.తమిళనాడు రాష్ట్రంలోని సింగారా, మారపళ్లం  గ్రామాలకు శివన్ ప్రతి రోజూ వెళ్లి ఉత్తరాలు, ప్రభుత్వం అందించే పెన్షన్లను అందిస్తున్నాడు.

Tamil Nadu postman walked 15 km through thick forests to deliver mails for 30 years, netizens salute him

ప్రతిరోజూ అతను కూనూరు సమీపంలోని హిల్‌గ్రోవ్ పోస్టాఫీసు నుండి 15 కి.మీ. దూరం అడవి గుండా ఈ గ్రామాలను చేరుకొంటాడు. ఈ అడవి గుండా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని స్థానికులు చెబుతారు. 

ఏ జంతువు ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తోందోననే భయం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కానీ ఈ భయాలను లెక్క చేయకుండా ఆయన 30 ఏళ్ల పాటు ఇదే దారిలో ప్రయాణిస్తూ ప్రజలకు ఉత్తరాలు, మనీఆర్డర్లు, పెన్షన్లు అందించారని స్థానికులు శివన్ సేవలను గుర్తు చేసుకొంటున్నారు. ఏనుగులు, ఎలుగుబంట్లతో పాటు పలు జంతువులను ఆయన ఈ దారి గుండా వెళ్లే సమయంలో చాలాసార్లు చూశాడు.

Tamil Nadu postman walked 15 km through thick forests to deliver mails for 30 years, netizens salute him

అయితే ఏ రోజు కూడ శివన్ కు అడవి జంతువులు అడ్డుపడలేదు. శివన్ గత వారంలో రిటైరయ్యారు.  శివన్ రిటైర్మెంట్ ను పురస్కరించుకొని ఐఎఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్ వేదికగా శివన్ అంకిత భావాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

 

ఈ ట్వీట్ కు నెటిజన్లు స్పందించారు. కొందరు ఆయనకు సెల్యూట్ చేశారు. ఓ నెటిజన్ ఆయనకు పద్మ అవార్డు ఇవ్వాలని కోరారు. ఈ అవార్డుకు ఆయన అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios