బిర్యానీ, మాంసం దుకాణాలు మూసెయ్యాల‌నే స‌ర్క్యూల‌ర్ ను వెన‌క్కి తీసుకున్న పోలీసులు.. అస‌లేం జ‌రిగిందంటే?

గణేష్ చతుర్థి వేడుకల నేపథ్యంలో తమిళనాడు కాంచీపురంలో పోలీసులు జారీ చేసిన స‌ర్క్యూల‌ర్ వివాదాస్ప‌దంగా మారింది. గణేష్ చతుర్థి వేడుకలను పురస్కరించుకుని మాంసం, బిర్యానీ దుకాణాల యజమానులు తమ స్టాళ్లను మూసివేయాలని కాంచీపురం పోలీసులు ఆంక్షాల‌ను జారీ చేశారు

Tamil Nadu police asks non-veg hotels to shut for Ganesh festival, withdraws circular

గణేష్ చతుర్థి వేడుకల నేపథ్యంలో తమిళనాడు కాంచీపురంలో పోలీసులు జారీ చేసిన స‌ర్క్యూల‌ర్ వివాదాస్ప‌దంగా మారింది. గణేష్ చతుర్థి వేడుకలను పురస్కరించుకుని మాంసం, బిర్యానీ దుకాణాల యజమానులు తమ స్టాళ్లను మూసివేయాలని కాంచీపురం పోలీసులు ఆంక్షాల‌ను జారీ చేశారు. ఈ ఆంశం ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో అధికారులు వెన‌క్కి త‌గ్గారు.  ఆ ఆంక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే..  గణేష్ చతుర్థి వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 2, 4వ తేదీల్లో కాంచీపురంలోని
సెంగాజునీరోడై స్ట్రీట్ మరియు కంచి శంకర మఠం ప్రాంతాల్లో ఉన్న బిర్యానీ, మాంసం దుకాణాలను మూసెయ్యాలని పోలీసులు స‌ర్క్యూల‌ర్  జారీ చేశారు.  టెంపుల్ సిటీ శివకంచిలోని అన్ని బిర్యానీ, మాంసం దుకాణాలను మూసివేయాలని, గణేశ్​ విగ్రహాలతో ఊరేగింపు ఈ ప్రాంతం గుండా వెళుతుందని తెలిపారు. ఈ  నేప‌థ్యంలో కాంచీపురం B1 స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జె వినాయగం నోటీసులో కోరారు. 
  
పండుగకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, బహిరంగ ప్రదేశాల్లో వినాయక‌ విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, ఉత్సవాలు, ఊరేగింపు స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి నిర్వ‌హ‌కులతో చర్చించారు. ఈ నేప‌థ్యంలో కాంచీపురం B1 స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జె వినాయగం నోటీసులు జారీ చేశారు.

దుకాణాలను మూసివేయాలన్న డిమాండ్‌పై టీఎన్‌ఎం సుధాకర్‌, జిల్లా కలెక్టర్‌ ఎం. ఆర్తిలను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు స్పందించలేదు. దీంతో సోష‌ల్ మీడియాలో పెద్ద‌ ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఆదేశాల‌ను వెన‌క్కి తీసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. 

గత కొన్ని నెలలుగా తమిళనాడులో  మ‌తప‌ర‌మైన అంశాలు రాజకీయంగా రంగు పులముకున్నాయి. అందులో బిర్యానీ, మాంసం, మ‌ద్యం దుకాణాలు తరచుగా ముఖ్యాంశాలలో నిలుస్తున్నాయి.  ఇటీవల, చెన్నైలో ప్రభుత్వం నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్‌లో బీఫ్ బిర్యానీ లేకపోవడం కూడా చర్చకు దారితీసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ విషయం హైలైట్ కావడంతో ఈ ఫెస్ట్ రెండవ రోజు బీఫ్ బిర్యానీ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios