మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది.
తమిళనాడు : తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయ్యారు. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేస్తున్న సెంథిల్ బాలాజీ. నిన్న మధ్యాహ్నం 2 గంటలనుంచి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో, కోయంబత్తూర్, కడూర్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 18 గంటలపాటు మంత్రి ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత మంత్రుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
ఆయనను భారీ స్థాయిలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా అధారాలు ఈడీకి లభించడంతో ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ వార్త విన్న వెంటనే చాతినొప్పి అంటూ ఒక్కసారిగా కూలిపోయారు మంత్రి. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. మంత్రిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా గత రెండు రోజులుగా ఈడీ తమిళనాడులో పలు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
