గజ తుఫాను భాదితులను పరామర్శించడానికి వెళ్ళిన ఓ మంత్రిపై కొందరు భాదితులు దాడికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఎఐడీఎంకే ప్రభుత్వంలో చేనేత శాఖ మంత్రి ఓఎస్. మణియన్ ది స్వస్థలం నాగపట్టినమ్. ఈ ప్రాంతంలో కూడా గజ తుఫాను తీవ్ర నష్టాన్ని మిగల్చింది. అందువల్ల అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటు తుపాను కారణంగా నష్టపోయిన బాధితులను పరామర్శించడాని మంత్రి మణియన్ పర్యటన చేపట్టారు.  

అయితే తమను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని అప్పటికే కోపంగా వున్న స్థానిక తుపాను భాదితులు మంత్రి రాకను అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు మంత్రిపై దాడికి ప్రయత్నించారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా వేట కత్తితో దాడికి ప్రయత్నించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మంత్రి సురక్షితంగా అతడి వాహనంలోకి తీసుకెళ్లిన నిరసన కారులు ఆగలేదు. ఆ వాహనంపై కూడా దాడి చేసి ద్వంసం చేశారు. దీంతో మంత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను ఓ ద్విచక్ర వాహనంపై అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. 

మంత్రి మణియన్ పై దాడికి పాల్పడ్డ ఘటనలో పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు...దాడితో సంబందమున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Scroll to load tweet…