కరోనా నా? నాకెందుకు వస్తదిరా? ఈ పామును తింటా..! ఇంకా కరోనా కాదు కదా దానమ్మ కూడా నన్ను ఏం చేయలేదు.. అంటూ తాగిన మత్తులో ఓ వ్యక్తి చిందులేస్తూ.. చచ్చిన పామును కసాబిసా కొరికి తినేశాడు. ఈ జుగుస్సా కరమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

ఆ సమయంలో వీడియో తీసిన కొందరు దీన్ని వైరల్ చేయడంతో అధికారులు ఆగ్రహించారు. ఆ వ్యక్తిని ట్రేస్ చేసి అరెస్టు చేయడంతో పాటు.. ఫైన్ కూడా వేశారు.కరోనా కి విరుగుడు అంటూ ఓ వ్యక్తి చచ్చిన పామును తిన్నాడు. ఈ వీడియో తమిళనాడులో వాట్సప్ గ్రూపులలో వైరల్ అయింది.

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మదురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు ఒక వ్యవసాయ కూలీ. 50ఏళ్ల వయసున్న వడివేలు ఈ మధ్య ఒక రోజు చచ్చిన  కట్లపాము ఒకదానిని పట్టుకొచ్చాడు. దీన్ని చేతిలో పట్టుకుని డాన్స్ చేశాడు. 

పాము కరోనాకి విరుగేనంటూ.. ఇక తనకు కరోనా రాదు అంటూ వ్యాఖ్యలు చేస్తూ అందరూ చూస్తుండగానే ఆ దాన్ని నమలి తినేశాడు. అయితే ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి వైరల్ చేశారు. జిల్లా ఫారెస్ట్ అధికారుల దాకా ఆ వీడియో చేరడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు.

చివరికి వడివేలుని గుర్తించి అరెస్టు చేశారు. ఆ టైంలో అతను ఫుల్ గా తాగి ఉన్నాడని, అదృష్టవశాత్తు అతను విష గ్రంథిని కొరకలేదని అధికారులు వెల్లడించారు .కట్లపాము విషంలో న్యూరోటాక్సిన్స్​  ఉంటాయని, అవి పక్షవాతాన్ని కలిగిస్తుందని ఫారెస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు.

కాగా ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని కొందరు బలవంతం  చేసి ఆ పని చేయించారని వడివేలు వాపోతున్నాడు. వడివేలును అరెస్టు చేయడంతో పాటు ఏడు వేల రూపాయల ఫైన్ కూడా విధించారు.