తమిళనాడులో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. నడి వీధిలో అందరూ చూస్తూ ఉండగానే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చారు. ఐదుగురు దుండగులు అతడిని పరిగెత్తించి మరీ చంపేశారు. ఈ ఘటన తమిళనాడులోని కరైకుడిలో ఆదివారం చోటుచేసుకుంది.
చెన్నై: తమిళనాడులో దారుణ హత్య జరిగింది. కొందరు దుండగులు ఓ వ్యక్తిని పరుగెత్తించి మరీ నడి వీధిలో దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. ఆ వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని కరైకుడి జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతి చెందిన వ్యక్తిని అరివళగన్ అలియాస్ వినీత్‌గా గుర్తించారు. ఆయన మదురై నివాసి అని కూడా కనుగొన్నారు. ఓ మర్డర్ కేసులో జోక్యం ఉన్నట్టు పోలీసు స్టేషన్‌లో సంతకం పెట్టాలని ఆయనను ఆదేశించినట్టు సమాచారం.
వినీత్ హఠాత్తుగా రద్దీగా ఉన్న రోడ్డుపై పరుగు లంకించుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నది. కాగా, ఎస్‌యూవీలో వచ్చిన ఐదుగురు వ్యక్తులు వినీత్‌ను చుట్టుముట్టారు. రోడ్డుపై వేగంగా పరిగెడుతూ అదుపు తప్పి వినీత్ కింద పడిపోయాడు. ఇంతలో ఆ ఐదుగురు వినీత్‌ను చుట్టుముట్టి దాడికి దిగారు. అందరూ చూస్తూ ఉండగానే కర్రలు, రాడ్‌లతో వినీత్ పై విచక్షణారహితంగా దాడి చేశారు.
Also Read: మండుతున్న ఎండలు.. కరిగిపోతున్న ట్రైన్ పట్టాలు, యూపీలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
అతడిని దారుణంగా కొడుతూ ఉండగా బ్లూ కలర్ చొక్కా ధరించిన ఓ వ్యక్తి వినీత్‌ను కాపాడటానికి వచ్చాడు. అందులో కొందరు ఈ వ్యక్తిపైనా దాడి చేయడానికి వచ్చారు. కానీ, బెదరకుండా అలాగే వారందరినీ ప్రతిఘటించే ప్రయత్నం చేయగా.. వారంతా ఎస్‌యూవీలో పరారయ్యారు. అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ, మార్గంమధ్యలోనే వినీత్ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు అతని మిత్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ దుండగుల కోసం గాలింపులు జరుపుతున్నారు. వినీత్ కండీషనల్ బెయిల్ పై విడుదలై ఇద్దరు మిత్రులతో ఓ లాడ్జీలో ఉంటున్నాడు.
