Tamil Nadu: మహిళలు, యువతులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా.. కొందరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. విచక్షణ కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావీ వరసలు మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ..తమిళనాడులోని తిరుచ్చిలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Tamil Nadu: సమాజంలో రోజురోజుకు నేర ప్ర‌వృత్తి పెరిగిపోతుంది. చిన్నారులు, యువతులు, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా.. కొందరు కామాంధులు వాటిని పట్టించుకోవడం లేదు. వావీ వరుస‌లు లేకుండా.. చిన్న‌,పెద్ద వయసు భేదం మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశంలో .. కామవాంఛ‌తో చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాల‌కు పాల్ప‌డి.. వారి బంగారు భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. కామాంధుల చేతికి చిక్కి చిన్నారులు విలవిల్లాడిపోతున్నారు. 

తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలో మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక‌దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి లైంగిక‌దాడికి పాల్పడ్డాడు. చిన్నారి అర‌డంతో చుట్టుపక్కల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే బాధిత తల్లి పోలీసులను ఆశ్ర‌యించింది.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా ఒలైయూర్ గ్రామంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాపా..అయితే.. పని నిమిత్తం ఇంట్లో పాప‌ను ఇంట్లో ఒంట‌రిగా విడిచి వెళ్లాడు. ఇదే అదునుగా భావించి.. ఆ చిన్నారిని నిర్మానుశ్య ప్రాంతంలోకి తీసుక‌వెళ్లి.. ఆమె పై లైంగిక దాడికి పాల్ప‌డాడు. దీంతో ఆ చిన్నారి భ‌య‌భంత్రుల‌కు గురై.. అర‌డంతో చుట్టుపక్కల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే బాధిత తల్లి తిరువెరంబూర్ పోలీస్ స్టేషన్‌ ఆశ్ర‌యించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి, నిందితుడిని పట్టుకున్నారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 9(ఎం),10 కింద కేసు నమోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. 

ఇలాంటి త‌ర‌హా ఘ‌ట‌న‌నే కృష్ణా జిల్లా విజయవాడ లో చోటు చేసుకుంది. న‌గ‌రంలో భార్యాభర్తలు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. వారి రెండో కూతురుకి ఏడేండ్లు. స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. రోజులాగానే పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వ‌స్తున్న‌ బాలికపై ఓ కామాంధుడు క‌న్నేశాడు. మాయమాటలు చెప్పి.. దుకాణానికి తీసుకెళ్లి.. న‌చ్చిన‌వి కొనిచ్చాడు. నిర్మానూష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి.. దారుణానికి పాల్పాడాడు.

అనంత‌రం.. ఇంటికి వచ్చిన చిన్నారి నీరసంగా ఉండ‌టం చూసి.. ఏమైందని అడగగా భయంతో వణికిపోయింది. విషయం పై లోతుగా ఆరా తీస్తే వారికి భయంకరమైన నిజాలు తెలిశాయి. దీంతో ఆ త‌ల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిపై అత్యాచారనికి పాల్పడిన కామంధుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై పోక్సో యాక్టు ప్రకారం కేసులు నమోదు చేశారు