చెన్నై: క్షుద్ర పూజలతో మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారనే నెపంతో  ఓ జ్యోతిష్యుడిని ఓ గుర్తు తెలియని వ్యక్తి నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన సోమవారం నాడు తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లాలో సోమవారం నాడు రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ జ్యోతిష్యుడిని ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి చంపాడు. పార్క్ కు వచ్చే మహిళలను క్షుద్రపూజలతో వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నాడని ఆ జ్యోతిష్యుడిని చంపేసినట్టుగా నిందితుడు చెబుతున్నాడు.

2016 లో కూడ తన ప్రియురాలిని కూడ ఇదే రకంగా మోసం చేశాడని నిందితుడు చెబుతున్నారు. హత్యకు గురైన జ్యోతిష్యుడు రమేష్‌ గా పోలీసులు అనుమానిస్తున్నారు. జ్యోతిష్యుడును చంపేందుకు నిందితుడు చెబుతున్న కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.