Tamil Nadu Governor RN Ravi: తుపాకీ ప‌ట్టుకునే వాళ్ల‌కు తుపాకీతోనే స‌మాధానం ఇవ్వాల‌ని తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవి అన్నారు. ఎందుకంటే హింస పట్ల  ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉంది.

Tamil Nadu Governor RN Ravi: హింసాకాండపై ప్రభుత్వం అనుస‌రిస్తున్న‌ జీరో టాలరెన్స్ విధానాన్నితమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవి సమర్థించారు. ఆదివారం కొచ్చిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో సంవాదం అవ‌స‌రం లేద‌ని అన్నారు. గత ఎనిమిదేళ్లలో తమిళనాడు ప్రభుత్వం లొంగిపోవడమే తప్ప ఇలాంటి సాయుధ గ్రూపుతో మాట్లాడలేదని రవి అన్నారు.

నాగాలాండ్‌ మాజీ గవర్నర్‌గా పనిచేసిన రవీంద్ర నారాయణ్ రవి.. తుపాకీ ప‌ట్టిన వాడితో తుపాకీతోనే స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. హింస పట్ల ప్రభుత్వాలు క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు. అదే సమయంలో దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో చర్చలు అవ‌స‌రం లేద‌ని అన్నారు. కొచ్చిలో మానవ హక్కుల సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవి ఈ విషయాన్ని తెలిపారు. భద్రత విషయంలో కొన్ని ఆందోళనలు ఉన్నాయని రవి చెప్పారు. అయితే, కాశ్మీర్, ఈశాన్య ప్రాంతం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు.

26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో పాకిస్థాన్‌తో కాంగ్రెస్-యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగడుతూ.. భారత్‌కు పొరుగు దేశం పాకిస్థాన్ మిత్రదేశ‌మా లేక శత్రుదేశమా అనేది స్పష్టం చేయాలని ఆయ‌న‌ అన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి తర్వాత ప్ర‌భుత్వం చేసిన‌ వైమానిక దాడులను గుర్తు చేశారు. పుల్వామా దాడిలో కనీసం 40 మంది పారామిలటరీ జవాన్లు వీరమరణం పొందారు. దీనిపై రవి మాట్లాడుతూ.. ఉగ్రవాద కుట్ర జరిగితే.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నద‌ని భార‌త్ స్పష్టమైన సందేశం ఇచ్చింద‌ని అన్నారు. 

 26/11 ముంబై ఉగ్రదాడి జరిగినప్పుడు.. దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. కొద్దిమంది ఉగ్రవాదులు భారత్‌ను కించపరిచేందుకు ప్రయత్నించారనీ, ఈ దాడులు జరిగిన 9 నెలల్లోనే, రెండు దేశాలు (భారత్, పాకిస్తాన్) ఉగ్రవాద బాధితులని పేర్కొంటూ మన అప్పటి ప్రధానమంత్రి, పాకిస్తాన్ ప్రధానమంత్రి సంయుక్త ప్రకటనపై సంతకం చేశారని తెలిపారు.