తమిళనాడులోని కడలూరు జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని శివనార్పురం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని శివనార్పురం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై అధికారులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనపై కడలూరు జిల్లా కలెక్టర్ కె.బాలసుబ్రహ్మణ్యం వివరాలు తెలుపుతూ.. ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం విచారం.. పరిహారం ప్రకటన
ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. బాధిత కుటుంబానికి మూడు లక్షల రూపాయల సాయం ప్రకటించారు. అలాగే గాయపడిన మహిళలకు ఒక్కొక్కరికి ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి నుంచి రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు.
గోడౌన్‌లో అగ్నిప్రమాదం
విజయవాడలో విద్యాధరపురంలోని ఓ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరగ్గా.. రాత్రి వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. మంటలార్పడానికి నాలుగు ఫైర్ ఇంజన్ల ఉపయోగించారు. ఈ ప్రమాదం అశోక్ స్టీల్ హోమ్ అప్లయెన్స్ గోడౌన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ షాప్ ను నగరంలోని వన్‌టౌన్‌కు చెందిన జయంతిలాల్ జైన్ నిర్వహిస్తున్నారు. గోడౌన్‌ను చాలాకాలంగా డాల్ఫిన్ బార్ రోడ్డులోనే కొనసాగిస్తున్నారు.
ఆదివారం మధ్యాహ్నం గోడౌన్ నుంచి దట్టమైన పొగలతో మంటలు బయటకు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే కొత్తపేట పైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి యజమాని అందుబాటులో లేకపోవడంతో ఆయన కుమారుడు శుభం జైన్ సంఘటనాస్థలానికి చేరుకున్నాడు. అయితే.. అతనికి సరుకుల గురించి సమాచారం తెలియకపోవడంతో నష్టాన్ని అంచన వేయలేకపోయారు, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు.
