Asianet News TeluguAsianet News Telugu

వేగంగా వీచిన గాలికి బస్సు పైకప్పే లేచిపోయింది.. తమిళనాడులో ఘటన.. ఫొటోలు వైరల్

తమిళనాడులో వేగంగా వీస్తున్న గాలికి రోడ్డుపై వెళ్లుతున్న బస్సు పైకప్పు లేచి వచ్చింది. ఖంగుతిన్న ప్రయాణికులు ఎడమ వైపున వాలిన మెటల్ షీట్‌ను చూసి అసలు విషయం గ్రహించారు. డ్రైవర్ బస్సును ఆపగా.. ప్రయాణికులు కిందకు దిగారు.
 

tamil nadu bus roof ripped off due to gusty winds, passenger shocked kms
Author
First Published May 31, 2023, 3:10 PM IST

చెన్నై: సాధారణంగా గాలులు వేగంగా వీస్తే కొన్ని చోట్ల ఇంటి పైకప్పుగా వేసుకునే రేకులు లేచిపోతుంటాయి. ఇంకొన్ని చోట్ల చెట్లు నేలకొరుగుతాయి. కానీ, తమిళనాడులో గాలి హోరుకు రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సు పైకప్పు లేచొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

558 బీ నెంబర్‌తో ఉన్న తమిళనాడు ప్రభుత్వ బస్సు పాజవేర్కడు నుంచి సెంగుండ్రంకు వెళ్లుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నై, దాని చుట్టుపక్కాల మంగళవారం గాలులు దుమారం రేపాయి. అతి వేగంగా గాలులు వీచాయి. సెగలు గక్కుతున్న ఎండలో ఆ బస్సు రోడ్డుపై వెళ్లుతుండగా.. గాలి శబ్దం ప్రయాణికులు వినిపించింది. దానితోపాటు ఒక్కసారిగా పెద్ద రేకు శబ్దం కూడా వినిపించింది. తమ మీదే ఏదో పడినట్టుగా బస్సులోని ప్రయాణికులు భయపడ్డారు. బస్సులో నుంచి ఎడమ వైపు వేలాడుతున్న మెటల్ షీట్‌ను చూసి.. బస్సు రూఫ్ లేచి పక్కకు వేలాడుతున్నదని గ్రహించారు.

వెంటనే డ్రైవర్ ఆ బస్సును రొడ్డుకు ఒక వైపున ఆపాడు. ప్రయాణికులు చకచకా కిందికి దిగిపోయారు.  సమీప ప్రాంతాల నుంచి చాలా మంది స్పాట్‌కు వచ్చి ఎప్పుడూ చూడని ఆ బస్సు దృశ్యాన్ని చూస్తున్నారు.

Also Read: అంతుచిక్కని కేసు.. మహిళను చంపి మాంసం తిన్న వ్యక్తి మృతి.. ఏం జరిగిందో గుర్తించలేకపోయిన వైద్యులు!

ప్రయాణికులు బస్సు కిందికి దిగి ఆ మెటల్ షీట్‌ను చూసి తమ దారిన తాము వెళ్లిపోయారు. ఈ ఘటన రాష్ట్ర రవాణా కార్పొరేషన్ మెయింటెనెన్స్ పై ప్రశ్నలు లేవదీస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios