సివిల్ కోడ్, జీఎస్టీ, ద్రవ్యోల్బణం గురించి డీఎంకే అబద్ధపు ప్రచారం చేస్తుందని తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై  ఆరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే చేసిన తీర్మానాల్లో ఏమాత్రం నిజం లేదని మండిపడ్డారు.

యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి)తో సహా పలు అంశాలపై అధికార డిఎంకె కేంద్రానికి వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని చేస్తోందని తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై ఆరోపించారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో నిజం బట్టబయలు అవుతుందని అన్నారు.డీఎంకే నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకుని ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. 


యుసిసి, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి), ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలపై డిఎంకె తప్పుడు ప్రచారం చేస్తుందనికె అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ కేంద్రాన్ని తప్పుపట్టే తీర్మానాలను ఆమోదించిందనీ, అయితే తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడానికి నిరాకరించిన మొండిగా పొరుగున ఉన్న కర్ణాటకపై, మేకేదాటు ఆనకట్ట నిర్మాణాన్ని కొనసాగించాలనే దాని నిర్ణయంపై మౌనంగా ఉందని విమర్శించారు.

 మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు కె.కామరాజ్‌ 121వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిఎంకె చేసిన తీర్మానాల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.