Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. మూడేళ్ల చిన్నారికి హెచ్ఐవీ

ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం కారణంగా.. మూడేళ్ల చిన్నారి హెచ్ఐవీ బారిన పడింది.

Tamil Nadu: 3-year-old tests positive for HIV after blood transfusion at govt hospital
Author
Hyderabad, First Published Feb 20, 2019, 4:31 PM IST

ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం కారణంగా.. మూడేళ్ల చిన్నారి హెచ్ఐవీ బారిన పడింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఓ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. హాస్పిటల్ లో చిన్నారికి రక్తమార్పిడి చేసిన ఏడు నెలల తర్వాత చిన్నారి హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సెంట్రల్‌ తమిళనాడులోని త్రిచిలో నివసించే ఓ జంట.. ఆనారోగ్యంతో బాధపడుతున్న తమ మూడేళ్ల కూతురిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. హెచ్‌ఐవీ పాజిటీవ్‌ అని తేలింది. దీంతో ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తమపై అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు. కానీ వారికి నెగటీవ్‌ వచ్చింది. దీంతో గతంలో తమ పాపకు రక్తమార్పిడి చేసే సమయంలో వైద్యుల చేసిన పొరపాటు కారణమని తెలుసుకున్నారు.

గతేడాది జులైలో చిన్నారికి అనారోగ్యం సరిగాలేకపోతే రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అప్పుడు చిన్నారికి  రక్తం ఎక్కించారు. ఆ రక్తం వృద్ధుడిదని తర్వాత తెలియడంతో..  రక్తం ఎక్కించడం సగంలో ఆపేసారు. ఆరక్తం కారణంగానే చిన్నారికి హెచ్ఐవీ సోకిందని చిన్నారి తండ్రి ఆరోపిస్తున్నాడు. కాగా...  ఆ ఆరోపణలను హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఖండిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios