తమిళనాడు: తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ కు మద్రాస్ హైకోర్టు జలక్ ఇచ్చింది. నక్కీరన్ ఎడిటర్ గోపాల్ అరెస్ట్ సరికాదంటూ స్పష్టం చేసింది. నక్కీరన్ గోపాల్ పై రాజద్రోహం కేసు పెట్టడాన్ని కోర్టు తప్పుబట్టింది. నక్కీరన్ గోపాల్ కు రిమాండ్ విధించడానికి మద్రాస్ హైకోర్టు వ్యతిరేకించింది. 

ఓ లైంగిక కేసు ఆరోపణల నేపథ్యంలో గవర్నర్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ,రాజభవన్  గౌరవానికి భంగం వాటిల్లే విధంగా అమర్యాదకరంగా కథనాన్ని ప్రచురించారని ఆరోపిస్తూ రాజభవన్ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు చెన్నై విమానాశ్రయంలో నక్కీరన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

గోపాల్‌ అరెస్ట్‌ పై తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్‌ ఖండించారు. బీజేపీ, అధికార ఏఐడీఎమ్‌కే ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేస్తున్నాయని ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి

"నక్కీరన్" ఎడిటర్ గోపాలన్‌ అరెస్ట్