చాలా మందికి ఫోన్ మాట్లాడితే... పక్కన ప్రపంచంలో ఏం జరుగుతోందన్న సోయి కూడా ఉండదు. ఆ ఫోన్ లోనే మునిగితేలుతుంటారు. ఇప్పటి వరకు కొందరు ఫోన్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేస్తూ ప్రమాదానికి గురైనవారు ఉన్నారు. కాగా... తాజాగా ఓ మహిళ... ఫోన్ మాట్లాడుతూ వెళ్లి పాము మీద కూర్చుంది. ఆ పాము ఎందుకు ఊరుకుంటుంది.. కాటేసింది. దీంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఘోరక్‌పూర్‌లోని రియనావ్ గ్రామానికి చెందిన గీతా అనే మహిళకు వివాహమైంది. ఆమె గ్రామంలో ఉంటుండగా భర్త మాత్రం థాయిలాండ్ లో ఉంటున్నాడు. విదేశాల్లో ఉన్న భర్త జైసింగ్ యాదవ్‌తో గీత ఫోన్లో మాట్లాడుతుంది. ఈ ధ్యాసలో పడి ఇంటిలోకి ప్రవేశించిన పాముల విషయాన్ని గమనించలేకపోయింది. ఇంట్లోకు వెళ్లిన రెండుపాములు మంచం ఎక్కి ఆడుతున్నాయి. 

అయితే బెడ్‌పై పరిచిన ప్రింటెడ్ బెడ్ షీట్ కావడంతో... వాటిపై పాములున్న విషయాన్ని గీత గుర్తించలేదు. బెడ్ రూంలోకి వెళ్లిన గీత భర్తతో ఫోన్లో మాట్లాడుతూ.. వెళ్లి పాములను చూడకుండా మంచంపై కూర్చొంది. అంటే అప్పటికై మంచంపై ఆడుతున్న ఆ రెండు పాములు గీతను కాటేశాయి. దీంతో గీత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే గీతను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు వదిలింది.

కాగా... కోపంతో ఊగిపోయిన కుటుంబసభ్యులు, గ్రామస్థులు పాములను చంపేశారు. అయితే.. గీత పాములపై కూర్చునే సమయంలో ఆ రెండు సంభోగంలో ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.