కొంతమంది రిటైర్డ్ న్యాయమూర్తులు "భారత వ్యతిరేక ముఠాలో భాగం" అని కిరణ్ రిజిజు చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ మండిపడ్డారు

కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ‌ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య మ‌రోసారి విభేధాలు తలెత్తాయి. కొన్నాళ్లుగా స్వతంత్ర న్యాయ వ్య‌వ‌స్థలో కేంద్ర ప్రభుత్వం జోక్యం పెరుగుతున్న‌ద‌ని విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఇప్ప‌టికే పలు మార్లు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేరుగానే న్యాయ వ్య‌వ‌స్థ‌ను టార్గెట్ చేస్తూ చాలా సార్లు విమ‌ర్శ‌లు గుప్పించారు.

మ‌రోసారి జడ్జీల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో కొంద‌రు న్యాయ‌మూర్తులు యాంటీ-ఇండియా గ్యాంగ్ లో భాగమ‌య్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తున్న భారత వ్యతిరేక ముఠాలో కొంతమంది రిటైర్డ్ జడ్జీలు భాగమని ఆరోపించారు. 

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ శనివారం మండిపడ్డారు. న్యాయశాఖ మంత్రి అక్రమార్కుడిలా మాట్లాడుతున్నారని జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ రిజిజుపై జైరామ్ రమేష్ ట్వీట్ చేస్తూ.. "అన్యాయాన్ని ప్రచారం చేస్తున్న న్యాయ మంత్రి. ఇది ప్రసంగం తర్వాత స్వేచ్ఛకు ముప్పు కాకపోతే ఏమిటి?" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇంతకీ ఏం జరిగింది ?

దేశ రాజ‌ధాని ఢిల్లీలో శ‌నివారం నాడు ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో న్యాయశాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు పాల్గొన్నారు. 'న్యాయమూర్తుల నియామకంలో జవాబుదారీతనం' అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను ప్రభుత్వం ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపైకి మారిందని అన్నారు. జాతీయ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టే విధంగా కొందరు రిటైర్డ్, యాక్టివిస్ట్ జడ్జీలు ప్రభావితం చేస్తున్నారనీ, న్యాయవ్యవస్థను ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఒత్తిడి తెస్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

న్యాయమూర్తులు ఏ రాజకీయ అనుబంధంలో భాగం కాదని న్యాయ మంత్రి అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ పాలన అవసరమని ఇంతమంది ఎలా చెప్పగలరు.. ఇలా ఎలా చెబుతారు.. ఎవరూ తప్పించుకోరు, దేశానికి వ్యతిరేకంగా తిరిగే వారు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కొలీజియం వ్యవస్థ కాంగ్రెస్ దుస్సాహసానికి నిదర్శనమంటూ విమర్శించారు.

Scroll to load tweet…