Asianet News TeluguAsianet News Telugu

దారుణం : బాలిక శీలం ఖరీదు.. ఐదు చెప్పుదెబ్బలు, రూ.50వేల జరిమానా.. !!

ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పంచాయతీ పెద్దలు, బాలిక శీలానికి వెలకట్టారు. బాలికమీద అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పంచాయతీ పెద్దలు 50 వేల పరిహారంతో పాటు.. ఐదు చెప్పు దెబ్బల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Take Rs 50,000, slap accused with slipper: UP panchayat's bizarre decision for rape victim - bsb
Author
Hyderabad, First Published Jun 30, 2021, 2:28 PM IST

ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పంచాయతీ పెద్దలు, బాలిక శీలానికి వెలకట్టారు. బాలికమీద అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పంచాయతీ పెద్దలు 50 వేల పరిహారంతో పాటు.. ఐదు చెప్పు దెబ్బల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. గ్రామ పెద్దలు న్యాయం చేయకపోవడంతో, బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో థ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మహారాజ్ గంజ్ జిల్లాలోని కోఠిభర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. 

ఈ నెల 23న గ్రామానికి చెందిన యువకుడు తమ కుమార్తె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడని, బాధితురాలి కుటుంబం పంచాయతీ పెద్దకు ఫిర్యాదు చేసింది. 23 సాయంత్రం పొలంలో కూరగాయలు కోస్తుండగా, నిందితుడు 13 యేళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు.

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. పురుషాంగం కోసేసుకున్నాడు..!...

అనంతరం నిందితుడు బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు. తరువాత ఇంటికి చేరిన బాలిక ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు వివరించింది. ప్రాణభయంతో ఉండటంతో భయపడిన బాధితురాలు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, న్యాయం కోసం గ్రామ పంచాయతీ పెద్దను సంప్రదించింది. కానీ పెంచాయితీ పెద్దలు మాత్రం నిందితుడికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.50 వేల జరిమానా విధిస్తూ విచిత్రమైన తీర్పునిచ్చింది. 

ఈ తీర్పుతో మనస్థాపానికి గురైన ఆ కుటుంబం 25న పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి తమకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ఘటనమీద పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతోపాటు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఈ సంఘటన మీద పోలీసు అధికారి ధన్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. పరీక్షల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios