తాజ్‌మహల్‌కు సంబంధించి రూ.1.94 కోట్ల నీటి బిల్లు, రూ.1.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌కు ఓ వింత నోటీసు వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్‌కు సంబంధించిన ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిలను చెల్లించాలంటూ ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కి నోటీసులు జారీ చేశారు. తాజ్‌మహల్‌పై రూ.1.47 లక్షల ఇంటి పన్ను బకాయిగా ఉందని, వెంటనే బకాయిని చెల్లించాలని నోటీసులలో పేర్కొన్నారు.
ఈ పన్నును 15 రోజుల్లోగా జమ చేయాలని నోటీసులో కోరారు. 15 రోజుల్లోగా పన్ను కట్టకపోతే తాజ్ మహల్‌ను జప్తు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నోటీసు గత నెల నవంబర్ 25న జారీ చేయగా.. ఇటీవల పురావస్తు అధికారులకు (ఏఎస్ఐ) వచ్చింది. ఇంటి పన్ను రూ.88,784 ఉండగా.. ఆ మొత్తానికి వడ్డీ రూ.47,943గా నోటీసులో చూపించారనీ, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఇంటి పన్ను రూ.11,098 అని పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. తాజ్‌మహల్‌ను రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారని, అందుకే ఈ పన్ను విధించారేమోనని ఏఎస్‌ఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. తొలిసారిగా ఇంటి పన్ను నోటీసు రావడంతో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
మరో స్మారక కట్టడానికి నోటీసులు
అంతటితో ఆగకుండా.. తాజ్‌మహల్‌తో పాటు యమునా నదికి అనుకుని ఉన్న స్మారక చిహ్నం మొఘల్ సమాధి అయిన టోంబో ఆఫ్ ఇత్మాద్-ఉద్-దౌలాపై కూడా ఇంటి పన్ను బకాయి నోటీసులు పంపినట్లు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆగ్రా (ఏఎస్‌ఐ) అధికారులు చెబుతున్నారు. ఇత్మాద్-ఉద్-దౌలా ఫోర్‌కోర్ట్ పేరుతో రక్షిత స్మారక చిహ్నం ఇత్మాద్-ఉద్-దౌలాకు ఈ నోటీసు పంపారని తెలిపారు.
తాజ్ మహల్, ఇత్మాద్-ఉద్-దౌలా లు జాతీయ స్మారక చిహ్నాలు అని, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తి అని అధికారులు అంటున్నారు. పన్ను లెక్కింపు కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏజెన్సీ పొరపాటు వల్లే ఇలా జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంటి పన్ను లెక్కింపు బాధ్యతలను సాయి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించినట్లు, పొరపాటున ఇలా నోటీసులు వచ్చి ఉంటాయని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సరితా సింగ్ తెలిపారు. గూగుల్ మ్యాపింగ్ ద్వారా కొన్ని చోట్ల లోపాలు గుర్తించినట్టు తెలిపారు. ఏదీ ఏమైనా తాజ్‌మహల్ నిర్మించి వందల సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు రాని నోటీసులు అప్పుడు రావడం ఆశ్చర్యకరం కలిగిస్తోంది.
