వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి కేరళలోని కాలికట్ వస్తున్న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వర్షం కురుస్తుండడంతో విమానం ల్యాండ్ చేసే సమయంలో జోరు వర్షం కురుస్తుండడంతో విమానం రన్ వే మీద నుండి స్కిడ్ అయి కింద పడి రెండు ముక్కలయింది. 

విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిరిండియా విమానం ప్రయాణికులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రకటించింది.

ఈ ప్రమాదానికి కాలికట్ ఎయిర్ పోర్టు తీరు కూడా ఒక కారణం. ఈ ఎయిర్ పోర్ట్ లోని రన్ వేను టేబుల్ టాప్ రన్ వే అంటారు. ఇలాంటి రన్ వే ల చివర లోయ ఉంటుంది. ఎత్తైన ప్రాంతంలో చదును చేసి ఎయిర్ పోర్టును నిర్మించడం వల్ల దాన్ని మరో వైపు పొడిగించలేరన్నమాట. అవతలివైపు లోయ ఉంటుంది. వబిమానం రన్ వే దాటితే లోయలోకి పడిపోతుంది.  

2010 మే 22న మంగళూరు ఎయిర్ పోర్టులో సైతం దుబాయ్ నుండి వస్తున్న విమానం కూడా ఇదే విధంగా ప్రమాదానికి గురైన దురదృష్టకర సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. విమానం రన్ వే పైనుంచి జారీ కిందపడి రెండు ముక్కలయింది. 

అప్పుడు ఆ విమానానికి మంటలు కూడా అంటుకోవడంతో అందాలని 158 మంది మరణించారు. కేవలం 8 మంది మాత్రమే బ్రతికి బట్టగట్టారు. అక్కడ అప్పుడు ప్రమాదం జరగడానికి కూడా రన్ వే నే కారణమా. అది కూడా టేబుల్ టాప్ రన్ వే నే. 

ఇలాంటి రన్ వేలపై పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా అది మృత్యుసమానమే అవుతుంది. అదే నేడు నిజమైంది. ప్రస్తుతానికి ఈ ఘటనకు గల కారణాలు తెలియరాకున్నప్పటికీ.... రన్ వే ఇంకోవైపు లోయ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు మాత్రం అర్థమవుతుంది. 

ఇదే కాలికట్ ఎయిర్ పోర్టులో టేబుల్ టాప్ రన్ వే ఉండడం వల్ల కేరళను వరదలు ముంచెత్తినప్పుడు కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ మొత్తం నీటిలో మునియోగిపోయినప్పుడు, ఇది ఎత్తైన కొండపై ఉండడంతో.... సహాయక చర్యలన్నీ అక్కడి నుండే నడిచాయి. 

ఇలాంటి టేబుల్ టాప్ రన్ వే లు చూడడానికి ఎంతో రమణీయంగా ఉంటాయి కూడా. కానీ ఇక్కడ విమానాలను దింపడానికి మాత్రం నిష్ణాతులైన పైలట్లు అవసరం. ఏ చిన్న పొరపాటు జరిగినా...  ఇలా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోవాలిసిందే.