Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ అల్లర్లు : ఎర్రకోట ఉద్రిక్తతలకు కారణమైన మరో కీలక నిందితుడి అరెస్ట్...

రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటపై దాడి ఘటనలో మణిందర్ సింగ్ అనే మరో కీలక నిందిుతుడిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మణిందర్ సింగ్ ఎర్రకోట దగ్గర కత్తులు ప్రదర్శిస్తూ.. సంఘ విద్రోహ శక్తులను హింసకు ప్రేరేపించినట్లు ఆరోజు నాటి వీడియోలు, ఫొటోల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిని బుధవారం స్వరూప్ నగర్ లోని తన ఇంట్లోనే అరెస్ట్ చేసినట్లు డీసీపీ ప్రమోద్ కుశ్వాహా తెలిపారు. 

sword-wielding most wanted accused from republic day violence arrested by delhi police - bsb
Author
Hyderabad, First Published Feb 17, 2021, 2:53 PM IST

రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటపై దాడి ఘటనలో మణిందర్ సింగ్ అనే మరో కీలక నిందిుతుడిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మణిందర్ సింగ్ ఎర్రకోట దగ్గర కత్తులు ప్రదర్శిస్తూ.. సంఘ విద్రోహ శక్తులను హింసకు ప్రేరేపించినట్లు ఆరోజు నాటి వీడియోలు, ఫొటోల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిని బుధవారం స్వరూప్ నగర్ లోని తన ఇంట్లోనే అరెస్ట్ చేసినట్లు డీసీపీ ప్రమోద్ కుశ్వాహా తెలిపారు. 

ప్రస్తతం అరెస్టైన మణిందర్ అనే వ్యక్తి స్తానికంగా ఏసీ మెకానిక్ గా పనిచేస్తూ.. కత్తిసాము ట్రైనింగ్ స్కూల్ నడుపుతున్నాడు. రిపబ్లిక్ డే రోజున తన అనుచరులతో కలిసి ఓ ప్లాన్ ప్రకారం రైతుల ర్యాలీలో చేరాడు. వారితో పాటు కలిసిపోయి.. అలా ఎర్రకోటకు చేరుకుని కత్తులను ప్రదర్శిస్తూ, సంఘ విద్రోహ శక్తుల్ని పోలీసులపైకి ఉసి గొల్పడంలో కీలకపాత్ర పోషించాడు. అతడిని ఫొటోలు, వీడియోల ఆధారంగా గుర్తించాం. ఆ హింసాత్మక ఘటన వ్యవహారంలో అతడు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఎర్రకోట ఘటనకు ముందు కూడా నిందితుడు పలుమార్లు సింఘు బార్డర్ కు వెళ్లి వచ్చినట్లు విచారణలో చెప్పాడని డీసీపీ ప్రమోద్ కుశ్వాహా తెలిపారు. 

అతడి వద్దనుంచి 4 అడుగుల పొడవైన రెండు కత్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా నిందితుడి మొబైల్ లోనూ ఎర్రకోట వద్ద కత్తులతో ప్రదర్శన చేస్తున్న దృశ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు కుశ్వాహా తెలిపారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ డిల్లీలో రైతులు రిపబ్లిక్ డే రోజు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పలువురు వ్యక్తులు ఎర్రకోట వద్దకు చేరి విధ్వంసం సృష్టించారు. చారిత్రక ఎర్రకోటపై మతపరమైన జెండాతో పాటు, రైతుల జెండాలను ఎగురవేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios