Asianet News TeluguAsianet News Telugu

స్విగ్గీ, జొమాటో మద్యం హోం డెలివరీ.. మొదట అక్కడే

స్విగ్గీ, జొమాటోలు ఇక నుంచి మద్యం హోం డెలివరీ చేయనున్నాయి. ఈ మేరకు జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో స్విగ్గీ మద్యం డెలివరీ సర్వీసులను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. 

Swiggy Zomato To Home Deliver Alcohol, Will Start With This City
Author
Hyderabad, First Published May 22, 2020, 8:58 AM IST

దేశంలో లాక్ డౌన్ కారణంగా దాదాపు 40 రోజుల పాటు ఎవరికీ మద్యం దొరకలేదు. ఇటీవలే దేశంలో మద్యం అమ్మకాలు షురూ చేశారు. అయితే.. వందల సంఖ్యలో క్యూలు కట్టి మరీ మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా క్యూ లైన్ లో నిలబడలేని వారి కి... జొమాటో, స్విగ్గీలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి.

స్విగ్గీ, జొమాటోలు ఇక నుంచి మద్యం హోం డెలివరీ చేయనున్నాయి. ఈ మేరకు జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో స్విగ్గీ మద్యం డెలివరీ సర్వీసులను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. జార్ఖండ్ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన తర్వాత సర్వీసులను ప్రారంభించిన స్విగ్గీ… దీని కోసం యాప్‌లో ‘వైన్ షాప్స్’ అనే ఆప్షన్‌ను ప్రవేశపెట్టినట్లు అధికారికంగా వెల్లడించింది.

మరోవైపు కస్టమర్లు తమ వయసును ధృవీకరించుకోవడానికి ఏదైనా గవర్నమెంట్ ఐడీతో పాటు ఓ సెల్ఫీ ఫోటోను పొందుపరచాల్సి ఉంటుంది. డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, మైనర్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ ఈ నిబంధనను అమలులోకి తెచ్చింది. అటు అన్ని ఆర్డర్లకు ఓటీపీ ఉంటుందని.. మద్యం పరిమితిలో కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపింది. 

స్విగ్గీ ఇప్పటికే పలు రాష్ట్రాలతో మద్యం హోం డెలివరీ విషయంపై అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జార్ఖండ్ ప్రభుత్వం మద్యం దుకాణాల దగ్గర భారీ క్యూలైన్లు ఏర్పడకుండా ఉండేందుకే లిక్కర్ హోం డెలివరీకు అనుమతి ఇచ్చింది. ఇక జొమాటో మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios