Asianet News TeluguAsianet News Telugu

ఏడాది తర్వాత ఆవులు, ఎద్దులు తమిళం, సంస్కృతంలో మాట్లాడతాయి

 నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తన అనుంగు శిష్యురాలు, నటి రంజితతో రాసలీలు జరిపిన వీడియోలు గతంలో పెద్ద దుమారాన్నే లేపాయి.  ఆ ఘటన మరవకముందే మహిళపై అత్యాచారం చేశారంటూ మళ్లీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 

Swami Nithyananda: I can make cows speak in Tamil and Sanskrit
Author
Delhi, First Published Sep 19, 2018, 3:44 PM IST

ఢిల్లీ: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తన అనుంగు శిష్యురాలు, నటి రంజితతో రాసలీలు జరిపిన వీడియోలు గతంలో పెద్ద దుమారాన్నే లేపాయి.  ఆ ఘటన మరవకముందే మహిళపై అత్యాచారం చేశారంటూ మళ్లీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా స్వామి నిత్యానంద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జంతువుల చేత తాను తమిళం, సంస్కృతం మాట్లాడించగలనని చెప్పి పెద్ద చర్చకు తెర లేపారు.
 
స్వామి నిత్యానంద తయారు చేసే ఓ సాఫ్ట్‌వేర్ ద్వారా జంతువులతో మాట్లాడించడగలనని చెప్తున్నారు. ప్రస్తుతం అది ప్రయోగ దశలో ఉందని, కొంత వరకు ప్రయోగాత్మకంగా విజయవంతమైనప్పటికీ, ఇంకా కొంత మేరకు కష్టపడాల్సి ఉందని నిత్యానంద తెలిపారు. తన మాటలను కొట్టిపారేయడానికి వీళ్లేదని, సరిగ్గా సంవత్సరం తర్వాత ఈ ప్రయోగం చేసి చూపించగలనని, అవసరమైతే తన వ్యాఖ్యల్ని రికార్డు చేసుకోండని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
కోతులతో పాటు మరికొన్ని ఇతర జంతువులకు అన్ని రకాల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉండవని స్వామి నిత్యానంద చెప్తున్నారు. వాటికి సూపర్‌ కాన్సియోస్ పురోగగతిని అందించినట్లైతే వాటిల్లో ఆయా ఆర్గాన్స్ వృద్ధి చెందుతాయంటున్నారు. శాస్త్రీయ, వైద్య విధానంలో త్వరలోనే దీన్ని చేసి చూపిస్తానంటున్నారు. ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ఆవులు, ఎద్దులు తమిళం, సంస్కృతం మాట్లాడతాయంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios