Asianet News TeluguAsianet News Telugu

క్రైం బ్రాంచ్ నుంచి సస్పెండైన కానిస్టేబుల్ చేసిన క్రైంకి... పోలీసులకే దిమ్మతిరిగింది..

పన్నెండు రాష్ట్రాల్లో ఏటీఎం దోపిడీలకు పాల్పడుతున్న ముఠాకు లీడర్ క్రైం బ్రాంచ్ నుంచి సస్పెండైన ఓ కానిస్టేబుల్ అని తెలియడంతో పోలీసులు షాక్ అయ్యారు. 

Suspended Constable Carried Out The ATM Robbery In 12 States in Delhi
Author
First Published Jan 18, 2023, 11:13 AM IST

ఢిల్లీ : అచ్చం సినిమాల్లో చూపించినట్టు లాంటి ఓ ఘటన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ లో చోటు చేసుకుంది. సస్పెన్షన్కు గురైన ఒక కాని స్టేబుల్ దొంగల ముఠాకు నాయకుడిగా మారాడు. 12 రాష్ట్రాల్లో అలజడి సృష్టించాడు. అతిపెద్ద ఏటీఎం దోపిడీ ముఠాను ఏర్పాటు చేసి.. కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించి తెలిసిన వివరాల ప్రకారం.. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన ఓ వ్యక్తిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఇటీవల కాలంలో 12 రాష్ట్రాల్లో ఏటీఎం దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 

అతని విచారణలో భాగంగా క్రైమ్ బ్రాంచ్ లో సస్పెన్షన్కు గురైన హెడ్ కానిస్టేబుల్ ప్రస్తావన వచ్చింది. అతనే ఈ ముఠాకు లీడర్ అని తెలిసింది. హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన అస్లూప్ ఖాన్ ఆ తర్వాత కొంతమందిని కూడగట్టి ఏటీఎం చోరీ ముఠాను ఏర్పాటు చేశాడని వెలుగులోకి వచ్చింది.  దీంతో పోలీసు ఉన్నతాధికారులు షాక్కు గురయ్యారు. ఇక దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే జనవరి 15న ఆల్వార్లోని విహార్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని పేరు వినోద్ కుమార్. అతను మోస్ట్ వాంటెడ్ ముఠాకు చెందిన సభ్యుడు. అతడిని చాలా జాగ్రత్తగా విచారించడం మొదలుపెట్టారు పోలీసులు.  

ఢిల్లీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఉండకూడదు.. మీ వాదన ప్రమాదకరం - కేంద్రంతో సుప్రీం కోర్టు...

ఆ విచారణలోనే ఆ గ్యాంగ్ లీడర్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ మాజీ కానిస్టేబుల్ అస్లూప్ ఖాన్ అని తెలిసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ లో కూడా ఇలాంటి చర్యల వల్లే అతడిని సస్పెండ్ చేశారు.  క్రైమ్ బ్రాంచ్ లో పనిచేసే సమయంలో కొందరు దుర్మార్గులతో చేతులు కలిపాడు. దీంతో డిపార్ట్మెంట్ అతని ఉద్యోగం నుంచి తొలగించింది.  అరెస్టు చేసింది. అయితే జైల్లో ఉన్న సమయంలో అతను మిగతా ఖైదీలతో మాట కలిపాడు. వారితో మెల్లగా పరిచయం పెంచుకొని ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.

జైలు నుంచి విడుదలైన తర్వాత తన ముఠాతో కలిసి ఏటీఎం చోరీలు మొదలుపెట్టాడు. అలా అతను హర్యానా, మహారాష్ట్ర, అసోం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా 12 రాష్ట్రాల్లో తన ముఠాతో కలిసి ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో ఇలా దాదాపు 50 లక్షలు, రాజస్థాన్ ఉదయపూర్ లలో 12 లక్షలు, అసోం లోని  మూడు ఏటీఎంలను కొల్లగొట్టి 30 లక్షలు.. దోచుకున్నారు.  అంతేకాకుండా ఈ ముఠా మీద దాడి, దోపిడి, అత్యాయత్నం వంటి కేసులు కూడా చాలా నమోదయ్యాయి. అనుకోకుండా వినోద్ కుమార్ అరెస్ట్ కావడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.  ఈ వివరాల ప్రకారం పోలీసులు ముఠా నాయకుడైన అస్లూప్ ఖాన్, ఇతర సభ్యులకు గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios