Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్ క‌లక‌లం.. ఇప్ప‌టివ‌ర‌కూ 107 సార్లు డ్రోన్స్ క‌ద‌లిక‌లు 

కశ్మీర్‌లోని సాంబాలోని జాఖ్ సరిహద్దు ప్రాంతంలో శ‌నివారం సాయంత్రం అనుమాస్ప‌దంగా ఓ డ్రోన్ తిరుగుతున్న భద్ర‌తా బ‌ల‌గాల‌కు స్థానికులు స‌మాచారం అందించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) జాఖ్ సరిహద్దు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రోన్ స్వాధీనం చేసుకుంది. 

Suspected Pakistani Drone Spotted In Border Area Of Samba District's Jakh
Author
First Published Sep 18, 2022, 11:50 PM IST

ఈ మధ్య కాలంలో స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. భారత సైన్యం వాటికి   నిలువరించి.. ధీటైన స‌మాధానం ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఏదో ఓ చోట ఉగ్ర‌దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. తాజాగా మరోసారి సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ల కలకలం రేగింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో  శ‌నివారం సాయంత్రం ఓ అనుమానాస్పద డ్రోన్ ను స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) గుర్తించింది.  జమ్ముకశ్మీర్‌లోని సంబా జిల్లాలోని స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ వారు డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. 
 
వివరాల్లోకెళ్తే..   కాశ్మీర్‌లోని సాంబాలోని జాఖ్ సరిహద్దు ప్రాంతంలో శ‌నివారం సాయంత్రం అనుమాస్ప‌దంగా ఓ డ్రోన్ తిరుగుతున్న భద్ర‌తా బ‌ల‌గాల‌కు స్థానికులు స‌మాచారం అందించారు.  దీంతో అప్ర‌మ‌త్త‌మైన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) జాఖ్ సరిహద్దు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.  అనుమానాస్పద డ్రోన్ ఉన్నట్లు గ్రామస్థులు తమకు సమాచారం అందించడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. సాంబాలో పాకిస్థాన్ మరోసారి డ్రోన్ కుట్రకు పాల్పడిందని ఎస్‌ఓజీ డీఎస్పీ ఘరు రామ్ అన్నారు.

రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. శనివారం సాయంత్రం పాకిస్థాన్ నుంచి డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించిందని, ఆ తర్వాత స్థానిక ప్రజల్లో కలకలం రేగింది.  సాంబా సెక్టార్‌లోని సరిహద్దు గ్రామమైన సారథి కలాన్ వద్ద డ్రోన్‌ను గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. చక్ దుల్మా నుంచి పాకిస్థాన్‌ హైదర్ పోస్ట్‌కు చేరుకుంది. మధ్యలో డెరా, మడూన్‌ గ్రామాల మీదుగా వెళ్లింది. డ్రోన్ భూమికి కనీసం 1 కిలోమీటరు ఎత్తులో ఎగురుతూ.. వైట్ లైట్‌ను వెదజల్లుతూ డ్రోన్‌ సంచరించినట్టు అధికారులు గుర్తించారు.  

భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించింది. సోమ‌వారం ఉదయం కూడా ప‌లు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. పాకిస్థాన్ గతంలో చాలాసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసిందని, డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భారత భూభాగంలోకి రవాణా చేస్తున్న‌ట్టు  డీఎస్పీ ఘరు రామ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు..  బంద్రాలి, జాఖ్,  సాంబా ఇతర పరిసర ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తోందని తెలిపారు. 

గ‌త నెల‌లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ను భ‌ద్ర‌త బ‌ల‌గాలు గుర్తించాయి.  దీంతో అప్ర‌మ‌త్త‌మైన  బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది పలు రౌండ్లు కాల్పులు జర‌ప‌డంతో డ్రోన్ పాకిస్థాన్ వైపు తిరిగి వెళ్లింది.

అంతకుముందు, పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో 107 సార్లు డ్రోన్లు తిరిగిన‌ట్టు అధికారులు గుర్తించారు. బీఎస్ఎఫ్ స‌మాచారం ప్రకారం..  ఈ ఏడాది జూలై వరకు.. అంత‌ర్జాతీయ‌ సరిహద్దు ప్రాంతంలో మొత్తం 107 సార్లు డ్రోన్‌లు సంచ‌రించినట్టు తెలిపింది. ఇందులో పంజాబ్, జ‌మ్మూకాశ్మీర్ ప్రాంతాల్లో ఈ ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చిన‌ట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ డ్రోన్‌లలో ఎక్కువ భాగం పాకిస్థాన్ నుంచి వచ్చాయని, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని డెలివరీ చేయడానికి ఉపయోగించ బడుతున్నాయని బీఎస్ఎఫ్  సీనియర్ అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios