హౌరా-న్యూఢిల్లీ రైల్వే లైన్‌ను నక్సలైట్లు పేల్చివేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడిహ్ జిల్లా చిచాకీ- చౌదర్యాబంధ్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు ట్రాక్ ను నక్సలైట్లు పేల్చివేశారు. దీంతో ఈ మార్గంలో న‌డిచే రైళ్ల ను నిలిపి వేశారు అధికారులు.  

హౌరా-న్యూఢిల్లీ రైల్వే లైన్ ను న‌క్స‌లైట్స్ పేల్చివేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడిహ్ జిల్లాలోని చిచాకి మరియు చౌదరి బంద్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌లను నక్సలైట్లు గురువారం పేల్చివేశారు. రైల్వే ట్రాక్‌లలో కొంత భాగాన్ని దెబ్బ‌తిన్న‌ది. ఈ ప్ర‌మాదాన్ని ముందుగా గుర్తించ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. దీంతో హౌరా- న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు రైల్వే అధికారులు. రైల్వే అధికారులు, స్థానిక పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే కార్మికులు, ఇంజినీరింగ్ సిబ్బంది హుటాహుటిన వచ్చి రైల్వే లైను పునరుద్ధరణ పనులు చేపట్టారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.