చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.చెన్నైలోని అన్నానగర్‌లోని  కందర్పదాస్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసోం రాష్ట్రంలోని ఘోరఖ్‌పూర్ వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ ఉగ్రవాద సంస్థకు  చెందినవాడిగా కందర్పదాస్‌ ఉన్నాడని  పోలీసులు అనుమానిస్తున్నారు.

గతంలో ఓ కేసులో కందర్పదాస్‌ను అరెస్టయ్యాడని పోలీసులు చెబుతున్నారు. చెన్నైలోని  ఓ ప్రముఖ ఆసుపత్రిలో కందర్పదాస్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో  కాంటాపూర్  ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చేస్తూ ఏర్పడిన సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

కందర్పదాస్ ను ప్రత్యేక పోలీసు బృందం విచారిస్తోంది. దాస్ ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. దాస్ ఫోన్‌ను పరిశీలించారు.ఈ ఫోన్‌లో  దాస్ ఓ గన్‌ను చేత్తో పట్టుకొని ఫోజు ఇచ్చిన ఫోటో పోలీసులకు లభ్యమైంది.