మోహన్ దాస్ అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా రసాల గ్రామంలో నివసిస్తున్నాడు. ఉదయం గ్రామస్తులకు శవమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని కుచమన్ జిల్లాలో సోమవారం నాడు షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చేతులు, కాళ్లు నోరు కట్టివేయబడిన 72 ఏళ్ల వృద్ధుడి మృతదేహం దొరికినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడిని మోహన్ దాస్ గా గుర్తించారు. ఆయన గత 15 సంవత్సరాలుగా రసాల గ్రామంలో నివసిస్తున్నాడు. తెల్లవారుజామున అతను శవమై కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

"అతను ఒంటరిగా జీవిస్తున్నాడు. చేతులు, కాళ్ళు, నోరు కట్టివేయబడిన స్థితిలో మృతదేహంగా దొరికాడు. ఇది హత్యగా అనుమానాలు రేకెత్తిస్తుంది. దీనిమీద హత్య కేసు నమోదు చేశాం. దర్యాప్తు జరుపుతున్నాం" అని కూచమన్ సిటీ ఎస్హెఓ సురేష్ కుమార్ తెలిపారు.

త్వరలో గృహా రుణాలపై రాయితీ పథకం.. రూ. లక్షల్లో ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత అదే గ్రామంలో ఉండే కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఆదివారం రాత్రి గ్రామస్థులతో మాట్లాడిన తర్వాత సాధువు తన గదిలో నిద్రపోయాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఆయన నేలపై శవమై పడి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు.

ఇదిలా ఉండగా, తెలంగాణలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. షేర్‌చాట్ యాప్‌లో స్నేహం చేసిన 26 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో 35 ఏళ్ల వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నిందితుడు ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని వాగ్ధానం చేశాడు. కానీ ఆ తరువాత ఆ మాట నిలబెట్టుకోలేదు. ఆమెను విడిచిపెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

హైదరాబాద్ మహిళపై అత్యాచారానికి సంబంధించిన వివరాలలోకి వెడితే...సౌదీ అరేబియాలో కూలీగా పనిచేస్తున్న నిందితుడు జూన్ 15న ఇండియాకు వచ్చాడు. నేరుగా హైదరాబాద్‌లో దిగి సికింద్రాబాద్ లాడ్జిలో గది తీసుకున్నాడు. అప్పటికే పరిచయం అయిన ఆ మహిళను కాంటాక్ట్ చేశాడు. తన గదికి రావాల్సిందిగా ఆహ్వానించాడని పోలీసులు తెలిపారు. 

అలా వారిద్దరూ కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. ఈ సమయంలోనే, అతను ఆమెపై అత్యాచారం చేసాడు. ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఆ తరువాత ఆమెను విడిచిపెట్టి అతని స్వగ్రామమైన కరీంనగర్‌కు వెళ్లిపోయాడు. తరువాత కాంటాక్ట్ లో లేడు. 

కొద్ది రోజులకు ఫోన్ చేసి.. "సౌదీ అరేబియాకు తిరిగి వచ్చానని..ఆమెను వివాహం చేసుకోవడానికి ఆసక్తి లేదని ఆమెకు తెలిపాడు. అతను ఫోన్‌లో కూడా ఆమెతో అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడాడు" అని పోలీసులు తెలిపారు. దీంతో ఆ మహిళ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన తరువాత ఆమె అతనికి ఫోన్ చేసినప్పుడల్లా తన తల్లి అనారోగ్యంతో ఉన్నదని.. బిజీగా ఉన్నానని ఆమెకు ఏదో ఒక సాకు చెబుతూనే ఉన్నాడు. తరువాత, అతను వివిధ కారణాలను చూపుతూ ఆమెనుండి తప్పించుకోవడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.

బాధితురాలైన ఆ మహిళ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఓ హోటల్‌లో బస చేసింది.