న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వారాజ్ ప్రధానమంత్రి ఇచ్చిన తేనీటి విందుకు గైరాజరయ్యారు.

నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా రెండో దఫా గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయడానికి ముందుగా  తేనీటి విందు ఇచ్చారు.రాష్ట్రపతి నిలయానికి సుష్మాస్వరాజ్ గురువారం నాడు  చేరుకొన్నారు. మోడీ మంత్రివర్గంలో సుష్మా స్వరాజ్‌కు ఈ దఫా చోటు దక్కలేదు. దీంతో రాష్ట్రపతి నిలయంలో  ప్రధానమంత్రి ఇచ్చిన  తేనీటి విందుకు ఆమె గైరాజరయ్యారు.

రాష్ట్రపతి భవన్‌కు ఆమె చేరుకొన్నా కూడ టీ పార్టీకి దూరంగా ఉన్నారు. జేడీ(యూ) కూడ ప్రధానమంత్రి ఇచ్చిన తేనీటి విందుకు దూరంగా ఉన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) రెండు మంత్రి పదవులను కోరుకొంది.ఎన్డీఏలోనే కొనసాగుతామని కూడ జేడీ(యూ) ప్రకటించింది.