బీజేపీ సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణం చెందారు. మంగళవారం గుండె నొప్పికి గురైన ఆమె ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే మృతి చెందారు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన సుష్మాకి ట్విట్టర్ క్వీన్ అనే బిరుదు కూడా ఉంది. విదేశాంగ మంత్రిగా విధులు నిర్వహించిన ఆమె... విదేశాల్లో ఉన్న మనవారితోపాటు... ఇతర దేశీయులకు కూడా ఎలాంటి సహాయం కావాలన్నా చేసేవారు. సుష్మా తమ పాకిస్తాన్ కి ప్రధాని అయితే బాగుండు అని ఓ పాక్ మహిళ అన్నదంటే...ఆమె గొప్పతనం ఎలాంటిదో ఇట్టే అర్థమౌపోతుంది.

పార్టీలో ఎంతో చురుకుగా ఉండే సుష్మాకి వేడి వేడి కచోరీలను తెగ ఇష్డపడేవారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున మధ్యప్రదేశ్‌లోని విదిశ నుంచి పోటీ చేసిన సుష్మా అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ఆమె విదిశకు రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. ఒకసారి విదిశ పార్లమెంటు పరిధిలోని రాయ్‌సేన్‌కు వచ్చారు. 

ఈ సంద్భంగా అక్కడి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆమెకు అందించేందుకు ఫలహారంలో భాగంగా డ్రై ఫ్రూట్స్ తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె వారిని ఇక్కడ ఏ వంటకం ప్రసిద్ధి చెందింది? అని అడిగారు. దీనికి సమాధానంగా వారు ‘కచౌడీ’ అని చెప్పారు. దీంతో ఆమె నవ్వుతూ ‘అరే వాహ్... నాకు ఇష్టమైన వంటకమే ఇక్కడ ప్రసిద్ధి పొందింది. మీరు ఒక పని చేయండి... వేడి వేడి కచౌడీలు తెప్పించండి’ అని అడిగారు. 

దీంతో అక్కడున్న నేతలు వెంటనే వేడివేడి కచౌడీలను ఆమె టేబుల్ మీద ఉంచారు. అవి ఎంతో బాగున్నాయని చెబుతూ తాను ఎప్పుడు వచ్చినా ఈ కచౌడీలను తనకు అందుబాటులో ఉంచాలని కోరారు. కాగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ నిర్వహించే కార్యక్రమాలకు సుష్మా హాజరైనపుడు స్థానిక బీజేపీ నేతలు ఆమెకు ఫలహారంగా కచోడీలను సిద్ధం చేసేవారు.