Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్ కేసు: ఉద్ధవ్ ప్రభుత్వంపై బీజేపీ కుట్ర, సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

శివసేన ఫైర్ బ్రాండ్ సంజయ్ రౌత్ వచ్చి చేరారు. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Sushant Singh case: Conspiracy being hatched against  Shiv Sena govt, says Sanjay Raut
Author
Mumbai, First Published Aug 9, 2020, 3:21 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు సినిమా రంగాన్ని దాటుకుని రాజకీయ రంగాన్ని తాకింది. ఇప్పటికే బీహార్- మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా శివసేన ఫైర్ బ్రాండ్ సంజయ్ రౌత్ వచ్చి చేరారు.

సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఒత్తిళ్లు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రౌత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఒక వ్యాసాన్ని రాశారు.

సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడం ముంబై పోలీసులను అవమానించినట్లేనన్నారు. సీబీఐని కేంద్రం ఎలా దుర్వినియోగం చేసుకుందో తన కాలమ్‌లో తన కాలమ్‌లో పేర్కొన్నారు.

సీబీఐ కేంద్ర ఏజెన్సీ అయినప్పటికీ, అది నిష్పాక్షికంగా దర్యాప్తు జరపదని అనేకసార్లు నిరూపించబడిందని రౌత్ వ్యాఖ్యానించారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని నిషేధించాయని, శారదా చిట్‌ఫండ్ చేసులో దుర్వినియోగం చేసుకున్నందుకు సీబీఐకి వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు వీధుల్లోకి వచ్చారని సంజయ్ గుర్తుచేశారు.

ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో  ఉన్నప్పుడు సీబీఐపై ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని వారు వ్యతిరేకించారు.

సుశాంత్ కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తే తప్పేంటి..? అని సుశాంత్ ప్రశ్నించారు. అలాగే ఓ వర్గం మీడియా సాయంతో బీజేపీ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios