మకర సంక్రాంతి రోజున ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మందితో సూర్య నమస్కారాల‌ను నిర్వ‌హించాల‌ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్ర‌ణాళిక‌లు చేస్తోంది. ఈ మేర‌కు ఆ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

జనవరి 14 ( january 14)న మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తం (world wise)గా 75 లక్షల మందితో సూర్య నమస్కారాల‌ను నిర్వ‌హించాల‌ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (ayush ministry) ప్ర‌ణాళిక‌లు చేస్తోంది. ఈ మేర‌కు ఆ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇందులో ఇత‌ర మంత్రిత్వ శాఖలు కూడా భాగ‌స్వామ్యం కానున్న‌ట్టు తెలిపింది.

సంక్రాంత్రి రోజున సూర్యునికి కృతజ్ఞ‌త‌గా న‌మ‌స్కారం అంద‌జేయాల‌ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సూర్య నమస్కార్కం రోగనిరోధక శక్తిని (health immunity)పెంపొందించడానికి, ప్రాణశక్తిని పెంపొందించడానికి శాస్త్రీయంగా ప్రసిద్ది చెందిందని తెలిపింది. క‌రోనా (corona) మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న ఇలాంటి స‌మ‌యాల్లో ఈ సూర్య‌న‌మ‌స్కారాలు చాలా ముఖ్య‌మైన‌దని పేర్కొంది. ఈ విష‌యంలో కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ (minister sarbanada sonoval) మాట్లాడారు. కోవిడ్ -19 (COVID-19) కేసులు పెరుగుతున్నందున దేశ ప్ర‌జ‌ల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ఇప్పుడు ఆవశ్యకంగా మారింది. శరీరాన్ని, మ‌న‌స్సును ధృడంగా ఉంచేందుకు ఎక్కువ మందిని సూర్య నమస్కారం చేయించ‌డం త‌మ మంత్రిత్వ శాఖ ల‌క్ష్య‌మ‌ని’’ చెప్పారు.

క‌రోనా మహమ్మారి కాలంలో ప్రజలలో సహజ రోగనిరోధక శక్తిని పెంచే మార్గంగా యోగా (yoga), ఆయుర్వేదం (ayurved), హోమియోపతి (homiopathi), సిద్ధ (sidda), నేచురోపతి (naturopathi), యునాని (unoni) వైద్య విధానాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో మంత్రిత్వ శాఖ మరోసారి కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి సోనోవాల్ తెలిపారు. సూర్యరశ్మి శరీరాన్ని ప్రత్యక్షంగా తాకడం వల్ల మానవ శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. దీనిని ఎన్నో హెల్త్ డిపార్ట్ మెంట్ లు సిఫార్సు చేశాయని ఆయ‌న చెప్పారు. ఈ విష‌యాన్ని త‌మ మంత్రిత్వ శాఖ గుర్తించింద‌ని తెలిపారు. 

శరీరం, మనస్సును సమన్వయం చేస్తూ ఈ సూర్య‌న‌మ‌స్కారాలు 12 దశల్లో ఎనిమిది భంగిమలు ఉంటాయి. దీనిని ఉద‌యం వేళ్ల‌లో చేయ‌డం వ‌ల్ల ఉత్త‌మ ఫ‌లితాలు ఉంటాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గతేడాది డిసెంబర్ 16న విడుద‌ల చేసిన లేఖ ప్ర‌కారం.. ఆజాది కా అమృత్ మహోత్సవ్ (azadi ka amruth mohastav)లో భాగంగా జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి ఏడో తేది వ‌ర‌కు 750 మిలియన్ల సూర్య నమస్కార్ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని నిర్ణయించుకుంది.

అయితే అజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ (azadi ka amruth mohastav) కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించాల‌నుకుంటున్న సూర్య న‌మ‌స్కారాల ప్రాజెక్టును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (india muslim personal law board) ఇటీవ‌ల వ్య‌తిరేకించింది. ఈ సూర్య న‌మ‌స్కారాల్లో ముస్లిం విద్యార్థులు పాల్గొనవ‌ద్ద‌ని సూచించింది. రెండు రోజుల కిందట ఉత్తరప్రదేశ్, బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికలల ప్ర‌చారంలో జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ముస్లిం నాయ‌కుడు గులాం రసూల్ బాల్యవి సూర్యన‌మ‌స్కారాల‌ను వ్య‌తిరేకించాడు. ‘‘ఇస్లాంలో మేము అల్లాను మాత్రమే ఆరాధిస్తాము. ఇస్లాం అనుచరులు అల్లా సృష్టించిన మరే ఇతర దేవుడిని పూజించలేరు. మేము జన్మనిచ్చిన వారిని పూజిస్తాం కాని పుట్టినవారిని పూజించబోము’’ అంటూ ఆయ‌న వివాదాన్ని రేకెత్తించారు.