Asianet News TeluguAsianet News Telugu

చిక్కుల్లో ఇరుకున్న ఎంపీ తేజస్వీ సూర్య.. ఇంతకీ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసిందేవరు? 

గతేడాది డిసెంబర్ 10న చెన్నై నుంచి తిరుచిరాపల్లి వెళ్లే ఇండిగో ఫ్లైట్ నంబర్ 6ఈ-7339లో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఈ విషయంలో బీజేపీ నేత తేజస్వి సూర్యపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎమర్జెన్సీ డోర్ తెరిచిన వ్యక్తి మరెవరో కాదు తేజస్వి సూర్య అని ట్విట్టర్‌లో మీడియా కథనాన్ని పంచుకున్నాడు.

Surjewala New Claim In The Emergency Door Opening Case, Made Serious Allegations Against Tejasvi Sur
Author
First Published Jan 18, 2023, 1:38 AM IST

ఇండిగో డోర్ ఘటనపై కాంగ్రెస్: ఇండిగోలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడు గత నెలలో చెన్నైలో విమానం ఎక్కిన తర్వాత ప్రమాదవశాత్తూ ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఈ విషయంలో బీజేపీ నేత తేజస్వి సూర్యపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎమర్జెన్సీ డోర్ తెరిచిన వ్యక్తి మరెవరో కాదు తేజస్వి సూర్య అని ట్విట్టర్‌లో కాంగ్రెస్ పేర్కొంది. 

ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా మంగళవారం ట్వీట్ చేశారు. వీరంతా బీజేపీకి చెందిన వీఐపీ ఆకతాయిలని అన్నారు. ఎయిర్‌లైన్‌కి ఫిర్యాదు చేయడానికి మీకు ఎంత ధైర్యం? అధికార బీజేపీకి చెందిన ఉన్నత వర్గానికి ఇదేనా ఆదర్శం? ఇది ప్రయాణీకుల భద్రతకు భంగం కలిగించిందా? ఓహ్, అలా ఉందా! బీజేపీ వీఐపీల గురించి మీరు ప్రశ్నలు అడగలేరు!అంటూ ట్విట్ చేశారు.  ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను అన్‌లాక్ చేసిన ప్రయాణీకుడు బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుండి మొదటిసారిగా గెలుపొందిన ఎంపీ అని ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై తేజస్వీ సూర్య నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

కొన్ని నివేదికలు 

వాస్తవానికి, గత నెలలో (డిసెంబర్ 10, 2022 న ) చెన్నై నుండి తిరుచిరాపల్లికి వెళ్తున్న ఇండిగో విమానం 6E-7339 ఫ్లైట్ నంబర్‌లో  ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను అనుకోకుండా తెరవబడింది. ఈ ఘటనపై బిజెపి యువమోర్చా అధినేత అని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనను ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు దాచిపెట్టిందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు సూర్య కానీ, అతని కార్యాలయం కానీ స్పందించలేదు. మీడియా నివేదికలను ఉటంకిస్తూ, ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అని విమానంలోని సహ ప్రయాణీకుడు ఆరోపించారు.

ఈ క్రమంలో ఇండిగో కంపెనీ తన ప్రకటనలో..“ప్రయాణికుడు తన చర్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాడు. ఈ సంఘటన స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం నమోదు చేయబడింది , విమానం యొక్క తప్పనిసరి ఇంజనీరింగ్ తనిఖీ జరిగింది, దీని కారణంగా విమానం ఆలస్యం అయింది. అని పేర్కొంది. 

DGSA ఏం చెప్పింది?

ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) సీనియర్ అధికారి పిటిఐతో మాట్లాడుతూ, సంఘటన ప్రక్రియ ప్రకారం సమాచారం అందించబడింది . భద్రతపై రాజీ లేదు. ప్రస్తుతం దీనిపై డీజీఎస్‌ఏ విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. ఆటలు ఆడే పిల్లలకు యాజమాన్య హక్కులు కల్పిస్తే ఏమవుతుందో తేజస్వి సూర్యే ఉదాహరణ అని కర్ణాటక కాంగ్రెస్ పేర్కొంది. విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్‌ను తెరిచే ప్రయత్నంలో చిన్నారుల వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ప్రయాణికుల జీవితాలతో ఆడుకోవడం ఎందుకు? అని నిలదీసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios