Asianet News TeluguAsianet News Telugu

Suresh N Patel: సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేష్‌ ఎన్‌ పటేల్‌.. రాష్ట్ర‌ప‌తి చేత ప్ర‌మాణ స్వీకారం 

Suresh N Patel: సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ గా  సురేశ్ ఎన్ పటేల్ బుధవారం నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్ నుండి తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (CVC)గా పనిచేస్తున్న ఆయ‌న‌ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రాబిటీ వాచ్‌డాగ్ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

Suresh N Patel Appointed As Central Vigilance Commissioner
Author
Hyderabad, First Published Aug 3, 2022, 4:33 PM IST

Suresh N Patel: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ ఎన్ పటేల్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ విడుద‌ల చేసిన‌ ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సురేష్ ఎన్ పటేల్  ప్ర‌మాణ స్వీకారం చేసినట్లు తెలిపింది. తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సివిసి)గా పనిచేస్తున్న పటేల్‌ను కమిషన్‌కు అధిపతిగా నియమించే అవకాశం ఉందని గత నెలలో నివేదించింది.

ఏడాది కాలంగా ఈ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో ఈ ఏడాది జూన్‌లో తాత్కాలిక సీవీసీగా సురేష్ ఎన్ పటేల్ ని నియ‌మించారు. ఈ నేప‌థ్యంలో పటేల్‌ను సెల‌క్ష‌న్ క‌మిటీ ఆమోదించ‌డంతో నేడు ఆయ‌న‌ను రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సెంట్రల్ విజిలెన్స్ కమిషన‌ర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.

ఆంధ్రా బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పటేల్.. ఏప్రిల్ 2020లో విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) మాజీ అధికారి సంజయ్ కొఠారీ గత ఏడాది జూన్ 24న సీవీసీగా పదవీకాలం పూర్తి చేశారు. 

సీవీసీ, విజిలెన్స్‌ కమిషనర్లను నిర్ణయించేందుకు ప్రధాని నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలక్షన్ ప్యానెల్ జూలైలో సమావేశమైంది. ఈ ప్యానెల్‌లో  ఇద్దరు సభ్యులు కేంద్ర హోం మంత్రులు కాగా.. మ‌రొక‌రు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు స‌భ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో సీవీసీగా పటేల్ నియామకాన్ని ప్యానెల్ ఆమోదించింది.

విజిలెన్స్ కమిషనర్లుగా మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, మాజీ వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అవినాష్ కుమార్ శ్రీవాస్తవ నియామకాలకు కూడా ప్యానెల్ ఆమోదం తెలిపింది.వీరిద్ద‌రూ కూడా బుధవారం సివిసి పటేల్ చేత విజిలెన్స్ కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. అరవింద్ కుమార్ ఈ ఏడాది జూన్ 30న అంతర్గత భద్రతా గూఢచార సంస్థ చీఫ్‌గా పదవీకాలం పూర్తి చేశారు. అవినాష్ కుమార్ శ్రీవాస్తవ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1982 బ్యాచ్ IAS అధికారి, జనవరి 2020లో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios